rainbow-coloured python mesmerizes netizens సప్వవర్ణాల ఇంద్రధనస్సు కొండచిలువను చూడండీ.!

Gorgeous rainbow snake will leave all reptile lovers mesmerized

Rainbow snake, viral video, Instagram, wildlife, Farancia erytrogramma, snake

A fascinating viral video that has been getting a lot of attention online features the wildlife gem of a rainbow snake. At first glance, the snake seen in the video appears to be blue but when you have a closer look, you will see that the reptile’s skin is of many different colours.

వీడియో వైరల్: సప్వవర్ణాల ఇంద్రధనస్సు కొండచిలువను చూడండీ.!

Posted: 06/26/2021 04:23 PM IST
Gorgeous rainbow snake will leave all reptile lovers mesmerized

పాము కనిపించగానే పరుగందుకుంటాం. ఎంతవారలైనా పామును చూడగానే భయపడిపోవడం సర్వసాధారణమే. పాములను పెంచేవారు, జూ సిబ్బందికి పాములతో సహవాసం భళే మజాగా ఉంటుంది. మనం సాధారణంగా రెండు, మూడు రకాల పాములను చూసి ఉంటే.. వారు రకరకాల పాములను పెంచుతూ ఆనందిస్తుంటారు. అలాంటి ముద్దుగుమ్మ ఒకరు జూలో పనిచేస్తూ రంగురంగుల పాములతో ఆడుకుంటోంది. అది అలాంటిలాంటి పాము కాదు.. రెయిన్‌బో స్నేక్‌.

రెప్టైల్‌ జూ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ పాము వీడియోను షేర్‌ చేసి మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. ఫరాన్సియా ఎరిట్రోగ్రామా అని పిలువబడే రెయిన్‌బో పాములు.. ఆగ్నేయ యునైటెడ్ స్టేట్స్ తీర మైదానాలకు చెందినది. ఈ వీడియోలో రెప్టైల్‌ జూ ఉద్యోగి ఒకరు రెయిన్‌బో పామును మెడలో వేలాడేసుకుని సంతోషంగా కెమెరాకు పోజులిచ్చింది. ఈ రెయిన్‌బో పాము అద్భుతమైన రంగులను ప్రదర్శిస్తున్నది.

ఈ పాము మొదట నీలం రంగులో కనిపించింది. పరిశీలనగా చూసేసరికి దాని చర్మం విభిన్న రంగులతో ఉన్నట్లు కనిపించింది. ఈ రంగులు బౌన్స్ అవుతున్నప్పుడు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఈ రెయిన్‌బో పాము వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవడంతో ఇంత అందమైన పామును చూసి నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. రెప్టైల్ జూ సిబ్బంది ఈ పాముకు మైలవ్స్‌ అని ముద్దుపేరు పెట్టుకున్నారు.

 
 
 
View this post on Instagram

A post shared by The Reptile Zoo (@thereptilezoo)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rainbow snake  viral video  Instagram  wildlife  Farancia erytrogramma  snake  

Other Articles