Ashok Gajapathi Raju enters Mansas trust మన్సాస్ ట్రస్టు చైర్మన్ గా కీలక అదేశాలు జారీ చేసిన అశోకగజపతి రాజు

Ap govt officials are responsible to conduct audit in trust ashok gajapathi raju

mansas trust controversy, mansas trust, mansas trust chairman, mansas trust vizianagaram, mansas trust issue, mansas trust news, Ashok Gajapathi Raju Latest News, Ashok Gajapathi Raju Take Charges Mansas Trust Chairman, Ashok Gajapathi Raju Assuming Responsibilities as Chairman, Andhra Pradesh, Politics

Ashok Gajapathi Raju after the High Court verdict on Mansas trust chairman has entered the fort on Thursday. He came to the trust for the first time as the chairman. Although Ashok Gajapathi Raju went to his office to sworn in as chairman, the trust staff was not available.

మన్సాస్ ట్రస్టు చైర్మన్ గా కీలక అదేశాలు జారీ చేసిన అశోకగజపతి రాజు

Posted: 06/17/2021 04:56 PM IST
Ap govt officials are responsible to conduct audit in trust ashok gajapathi raju

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజు దూకుడు పెంచారు. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ట్రస్టు ఈవో, కరస్పాండెంట్ గైర్హజరు కావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింహాచలం ఆలయ ఈవో కూడా తనను కలవడానికి ఇష్టపడ లేదని, రామతీర్థానికి పంపిన చెక్కును వెనక్కి పంపి తనను మానసిక క్షోభకు గురి చేశారన్నారు. రామతీర్థం విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మాన్సాస్ భూముల్లో ఇసుక అక్రమాలు ఎవరి హయాంలో జరిగాయో తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై తానే దేవాదాయ శాఖ కమిషనర్ కి లేఖ రాసినట్లు, అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని ఈ సందర్భంగా తాము కోరడం జరిగిందన్నారు. అక్రమాలపై విచారణ జరిపితే, ఆ రిపోర్ట్ ను ఎందుకు బయట పెట్టడం లేదు ? అలా బయట పెట్టడం లేదంటే…అందరినీ మభ్యపెడుతున్నారని అనుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ విచారణ చేసి, ప్రభుత్వానికి పంపిన నివేదికను ఎందుకు బహిరంగ పర్చడం లేదని అశోక గజపతి రాజు సూటిగా ప్రశ్నించారు.

మాన్సాస్ ట్రస్ట్ లో పదేళ్లుగా ఆడిట్ జరగలేదన్న ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ ఈవోకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మాన్సాస్ ట్రస్ట్ లో ఆడిటింగ్ పై వివరణ కోరారు. సంస్థ నుంచి చెల్లించిన ఆడిటింగ్ ఫీజుపై 21లోగా వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ట్రస్ట్ పరిధిలోని విద్యా సంస్థల బడ్జెట్ పై వారం రోజుల్లో ప్రతిపాదనలు రెడీ చేయాలన్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 5లక్షలు పైబడిన కొనుగోళ్లపై వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే మాన్సాస్ సిబ్బంది జీతాలు వెంటనే చెల్లించాలని అశోక్ గజపతి రాజు ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles