No relook at decision to cancel class 12 exams, says SC జులై 31 నాటికి 12వ తరగతి ఫలితాలు: సీబీఎస్ఈ

Cbse 12th result 2021 by july 31 class 10 result by july 20

cbse, cbse result, cbse result 2021, cbse class 12th result decision, cbse decision on class 12th results, cbse news, cbse board result, cbse results 2021, cbse 12th result 2021, cbse board 12th result 2021, cbse result 2021 class 12, cbse result 2021 class 12, cbse result online, cbse result 2021 online, cbseresults.nic.in result 2021, cbse board class 12 result 2021

The Central Board of Secondary Education (CBSE) today released the evaluation criteria or the final strategy through which it will assess Class 12 students. The Supreme Court approved the assessment schemes of CISCE and CBSE, which has adopted 30:30:40 formula for evaluation of marks for students based on results of class 10, 11 and 12 respectively. The CBSE Class 12 results will be released by July 31.

జులై 31 నాటికి 12వ తరగతి.. జులై 20 లోపు 10వ తరగతి ఫలితాలు: సీబీఎస్ఈ

Posted: 06/17/2021 04:03 PM IST
Cbse 12th result 2021 by july 31 class 10 result by july 20

జూలై 31 లోగా సీబీఎస్ఈ ఫలితాలు విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించారు. CBSE – 12వ తరగతి మార్కుల నిర్ధారణ విధానాన్ని ప్రకటించిన క్రమంలో..10,11 క్లాస్ మార్కుల ఆధారంగా 12వ తరగతి మార్కులు విధానం ఉంటుందని తెలిపింది. 30+30+40 పార్ములా ఆధారంగా ఫలితాలను నిర్దారిస్తామని వెల్లడించింది. 10వ తరగతి మార్కుల నుంచి 30 శాతం వెయిటేజీ, అలాగే 11వ తరగతి మార్కుల నుంచి 30 శాతం వెయిటేజ్, 12వ తరగతి మార్కుల నుంచి 40 శాతం వెయిటేజ్ ఉంటుందని తెలిపింది.

12వ తరగతి ఫలితాల విడుదలకు అనుసరించే ప్రణాళికను కోర్టుకు సమర్పించింది CBSE బోర్డు. 10వ తరగతిలో ప్రతిభకు 30 శాతం, 11వ తరగతిలో ప్రతిభకు 30 శాతం, 12వ తరగతతి ప్రీ బోర్డు ఫలితాలకు 40 శాతం వెయిటేజీ ఇస్తామని జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్ , జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనానికి వివరించింది. CBSE ఇచ్చిన మార్క్ లతో సంతృప్తి చెందని విద్యార్థులు కరోనా కంట్రోల్ లోకి వచ్చాక పరీక్షలు రాసుకోవచ్చన్నారు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు.

మార్కుల ప్రణాళికను 13 మంది నిపుణులతో కూడిన కమిటీ సిపార్స్ చేసిందని సుప్రీంకోర్టుకు CBSE తెలిపింది. 1929 నుంచి బోర్డు ఉన్నా ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదని..కానీ ఈ కరోనా సమయంలో ఇటువంటివి తప్పటంలేదని వివరించింది. ఈ వివరణపై సుప్రీంకోర్టు.. మార్కులపై అభ్యంతరాలుంటే పరిష్కరించే మెకానిజం ఉండాలని సూచించిది. గత సంవత్సరం చాలా మంది మార్కులపై అభ్యంతరాలు చెబుతూ కోర్టును ఆశ్రయించారని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది. కాబట్టి విద్యార్ధులకు..వారి తల్లిదండ్రులకు మార్కులపై అభ్యంతరాలు వినేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నామని అన్నారు అటార్నీ జనరల్ వేణుగోపాల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles