Woman gives birth to 10 babies at one time కొత్త రికార్డు.. ఒకే కాన్పులో పది మందికి జన్మనిచ్చిన మహిళ

African woman gives birth to 10 babies may create new world record

south africa,guinness world records,most children delivered,most children record,south african woman,south african woman guinness,south african woman guinness record,south african woman guinness world record,Gosiame Thamara Sithole,Gosiame Thamara Sithole guinness record,Gosiame Thamara Sithole guinness world records, decuplets, New world record, Guiness Record, Ten babies at one time, South Africa

A South African woman has reportedly given birth to 10 babies, in what would be a world record earlier held by an American woman, according to a local media report. Gosiame Thamara Sithole, 37, gave birth to seven boys and three girls, reported Pretoria News

కొత్త రికార్డు.. ఒకే కాన్పులో పది మందికి జన్మనిచ్చిన మహిళ

Posted: 06/09/2021 01:18 PM IST
African woman gives birth to 10 babies may create new world record

దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ఏకంగా 10 మంది పిల్లలకు జన్మనిచ్చిందన్న వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ది ఓ మహిళ.. ఒకే కాన్పులో 10మంది పిల్లలు పుట్టడం తొలిసారి కానుంది. దీంతో ఈ మహిళ ప్రపంచ రికార్డును కూడా సోంతం చేసుకోనుంది. సౌతాఫ్రికాకు చెందిన 37 ఏళ్ల గోసియామే థమారా సిథోలే 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఏడుగురు మగ పిల్లలు కాగా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వీరంతా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ విషయంపై గోసియామే థమారా సిథోలే భర్త తెబోగో సోతెత్సీ మాట్లాడారు.

ప్రిటోరియాలోని ఆస్పత్రిలో తన భార్య గోసియామే 10 మంది పిల్లలకు జన్మనిచ్చిందని తెలిపాడు. ఆరు నెలల గర్భం సమయంలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆరుగురు పిల్లలు ఉన్నట్లు తెలిపారని, ఆ తర్వాత మరోసారి స్కాన్ చేసినప్పుడు 8 మంది ఉన్నట్లు గుర్తించారని, పిల్లలు పుట్టినప్పుడు మాత్రం మొత్తం 10 మంది ఉన్నట్లు తేలిందని తెలిపారు. ఈ దంపతులకు గతంలోనూ ఇద్దరు పిల్లలు వున్నారు. ఆ ఇద్దరు కూడా కవలలే కావడం గమనార్హం. ప్రస్తుతం ఆ ఇద్దరు కవలల వయస్సు ఆరేళ్లు. ఈ క్రమంలో మరోమారు గర్భం దాల్చిన గోసియామే ఏకంగా పది మందికి జన్మనిచ్చింది.

ఏ ఉద్యోగం లేకపోయినా వీరిని జాగ్రత్తగా చూసుకుంటానని తండ్రి తెబోగో సోతెత్సీ తెలిపారు. ఇంతమంది పిల్లలు పుట్టడం ఆనందంగా ఉందని వివరించాడు. మరోవైపు గత నెలలో మొరాకోలో హాలిమా సిస్సే అనే మహిళ 9 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఆమె రికార్డును గోసియామే థమారా సిథోలే బ్రేక్ చేశారు. అయితే ప్రస్తుతం ప్రపంచ గెన్నీస్ రికార్డు ప్రకారం మాత్రం అత్యధిక పిల్లలకు ఒకే కాన్సులో జన్మనిచ్చిన తల్లిగా అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన నాధ్యా సులేమాన్ పేరిట నమోదైంది. అమె ఎనమిది మంది పిల్లలకు ఒకే కాన్సులో జన్మనిచ్చారు. 2009లో అమె ఆరుగురు మగ, ఇద్దరు ఆడ పిల్లలకు ఒకే కాన్పులో జన్మనిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles