Telangana Govt. cancels 2nd year Intermediate Exams తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు రద్దు

Class 12 board exam cancelled in telangana in view of covid 19

Telangana State Board of Intermediate Education (TSBIE), TS Inter Exams 2021 Cancelled, Telangana Government, Covid surge, Telangana Class 12 Board exam 2021, TS Inter exam, TS inter exam 2021, TS 12th exam 2021, class 12 board exam 2021, telangana class 12 postponed news, telangana class 12 inter exam, telangana class 12th inter latest news

The Telangana Government has cancelled the Class 12 Intermediate exams. The Telangana State Board of Intermediate Education (TSBIE) exams were postponed in April due to the ongoing Covid surge. The board is yet to announce a decision on the evaluation criteria as to how the students of the cancelled Class 12th Intermediate board exams will be evaluated.

తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు రద్దు

Posted: 06/09/2021 12:28 PM IST
Class 12 board exam cancelled in telangana in view of covid 19

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంధ్రారెడ్డి వెల్లడించారు. ముందుగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. మే 1 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. మే 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు, మే 2 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు జరుగుతాయని షెడ్యూల్ లో నిర్ణయించారు. పరీక్షల నిర్వహణ సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అని ప్రకటించారు.

ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే వీటిని కూడా వాయిదా వేసిన ప్రభుత్వం ప్రాక్టికల్ పరీక్షలను మే 29 నుంచి జూన్ 7 వరకు నిర్వహిస్తామని గతంలో ప్రకటించారు. కానీ ఇటీవల వాటిని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. అయితే కరోనా మహమ్మారి రెండవ దశ విజృంభన నేపథ్యంలో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. పలు కీలక అంశాలపై నిర్ణయం నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో భేటీ అయిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

అయితే నిర్ణయాన్ని కాసింత వేచి చూసే ధోరణిలో పెట్టిన ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఇటీవల కేంద్రప్రభుత్వం సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే బాటలో పయనించాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. వీటి పంధానే అనుసరిచింన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తూ ఇవాళ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక ఇప్పటికే పదో తరగతి పరీక్షలను కూడా ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేస్తున్నట్లు  ప్రకటించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles