AP government extends curfew till June 20 ఏపీలో ఈ నెల 20 వరకు కర్ఫ్యూ.. 11 నుంచి సడలింపులు..

Andhra pradesh extends curfew till june 20 relaxations given from 6 am to 2 pm

Andhra Pradesh government, Curfew extended, YS Jagan Mohan Reddy, Curfew extended, Andhra Pradesh Lockdown, Lockdown, AP Lockdown, increases relaxation time, Andhra Pradesh, Crime

The Andhra Pradesh government headed by chief minister YS Jagan Mohan Reddy decided to extend the curfew in the wake of the ongoing citation of Corona cases in the state. The curfew has been extended to 20th of this month and it increased relaxation time.

ఏపీలో ఈ నెల 20 వరకు కర్ఫ్యూ.. 11 నుంచి సడలింపులు..

Posted: 06/07/2021 02:27 PM IST
Andhra pradesh extends curfew till june 20 relaxations given from 6 am to 2 pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభన తగ్గుముఖం పట్టడం లేదు. దాదాపుగా 40 రోజుల తరువాత ఇవాళ కేసుల సంఖ్య ఐదు వేలకు తక్కువగా నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు తక్కువగానే నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి, అరోగ్యశాఖ అధికారులకు కొంత ఊరటనిస్తోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ నెల 10తో ముగియనున్న కర్ఫ్యూను మరో పది రోజుల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులను పూర్తిగా నియంత్రించేందుకు ఇదోక్కటే మార్గమని భావించిన సర్కార్ ఆదిశగా నిర్ణయం తీసుకుంది.

అయితే రాష్ట్రంలో పూర్తిగా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సానుకూల ఫలాలను అందిస్తూ పది వేలకు పైగా నమోదైన కేసులు నాలుగు వేల సంఖ్యలో నమోదు కావడంతో.. ప్రస్తుతం వున్న ఆంక్షలను మరికొందగా విధిల్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ నెల 11 నుంచి జూన్‌ 20 వరకూ పొడిగించిన కర్ఫ్యూలో భాగంగా.. జూన్‌11 నుంచి కర్ఫ్యూ సమయాల్లో పొడిగింపు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వున్న కర్ఫ్యూను మరో రెండు గంటల పాటు సడలింపునిచ్చింది.

దీంతో ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూను సడలింపు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ కార్యాలయాలు ఉ.8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు పని చేస్తాయని వెల్లడించింది. కరోనాను పూర్తిగా నియంత్రించాలని సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే కర్ఫ్యూను పొడిగించింది. ప్రస్తుతం ఉన్న కర్ఫ్యూ 2021, జూన్ 10వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. కర్ఫ్యూతో సత్ఫలితాలు ఇస్తున్న క్రమంలో..మరికొన్ని రోజులు పొడిగిస్తే బెటర్ అని భావించింది రాష్ట్ర ప్రభుత్వం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Curfew extended  YS Jagan  Lockdown  AP Lockdown  increases relaxation time  Andhra Pradesh  Crime  

Other Articles