CBI starts probe in YS Viveka’s case ఏడు నెలల తరువాత వైఎస్ వివేకా హత్యకేసు తిరిగి విచారణ

Cbi team starts probe after 7 months in ys viveka s case

CBI, Y S Vivekananda Reddy, Y S Viveka Murder case, YS Sunitha, YS Sowbhagyamma, DeviReddy Shiva Shanker Reddy, YSRCP, TDP, YS Sunitha, Kadapa SP, K K Anburajan, Pulivendula, High court, Andhra Pradesh, Crime, Politics

The officers of the Central Bureau of Investigation (CBI) are still continuing their investigation into the murder of former MP YS Vivekananda Reddy in Pulivendula over two years ago. The CBI team is visiting the Kadapa district today. This is after a gap of over 7 months.

వైఎస్ వివేకా హత్యకేసు: ఏడు నెలల తరువాత తిరిగి సీబిఐ విచారణ

Posted: 06/07/2021 12:01 PM IST
Cbi team starts probe after 7 months in ys viveka s case

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బ్రేక్ తీసుకున్న సీబీఐ తిరిగి తమ విచారణను కొనసాగిస్తోంది. రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు శరవేగంగ దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కీలక అనుమానితులను అధికారులు విచారిస్తున్నారు. తమ విచారణను కొనసాగించే క్రమంలో నిన్ననే కడప కేంద్ర కారాగారం అతిధిగృహానికి విచ్చేసిన సిబిఐ అధికారులు ఇవాళ ఉదయం ఈ కేసులో అనుమానితులుగా బావిస్తున్నవారిని విచారించనున్నారు. ఇదివరకే పులివెందులకు చెందిన వైసీపి రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి కడపలో సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

కాగా, కడప ఎంపీ వై.ఎస్‌ అవినాష్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని కూడా సీబిఐ విచారించడం గమనార్హం. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయనకు అత్యంత కీలకమైన వ్యక్తిగా వున్న నేతపై కూడా వైఎస్ వివేకా కుమార్తె సునీత అనుమానం వ్యక్తం చేశారు. వారి పేర్లను కూడా అమె వివేకా హత్య కేసులో అనుమానితులుగా పేర్కోన్నారు. గతంలో ఇచ్చిన 15 మంది జాబితాలో పొందేపర్చిన పేర్లకు అదనంగా అమె అవినాష్ రెడ్డి పేరును చేర్చారు. దీంతో ఇవాళ సీబీఐ అధికారులు ఈ కేసులో కీలకమైన వ్యక్తులను విచారించనున్నారు.

గతేడాది కేసును విచారిస్తున్నసీబీఐ అధికారులు కొందరు కరోనా బారినపడడంతో దర్యాప్తు అర్థాంతరంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో తిరిగి నిన్న కడపకు చేరుకున్న సీబీఐ అధికారులు నేటి నుంచి విచారణకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు కీలక వ్యక్తులకు నోటీసులు పంపిన అధికారులు నేటి విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏడు నెలల క్రితం ఆగిపోయిన విచారణ నేటి నుంచి మళ్లీ మొదలు కానుంది. సిబిఐ విచారణ కొనసాగుతున్న క్రమంలో ఈ హత్యకేసుతో ప్రమేయమున్నవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ప్రారంభమయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles