Etela Rajender Resigns from MLA post and TRS టీఆర్ఎస్ పార్టీకి మాజీమంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా

Treated as slaves former minister etela rajender resigns from trs

etela rajender, etela rajender news today, etela rajender news, etela rajender trs, etela rajender mla, etela rajender new party, etela rajender news latest, etela rajender updates, Etela Rajender resigns from TRS, Etela Rajender to join BJP, Telangana minister, Jamuna Hatcheries, Hyderabad, Talangana, Politics

Telangana MLA Etela Rajender has announced his decision to bid goodbye to TRS membership and also tendered his resignation to the Huzurabad MLA post. He decided to quit the TRS party after returning to Hyderabad from his three days tour of New Delhi.

‘‘అది బానిసల భవన్..’’ మంత్రి పదవి కన్నా ఆత్మగౌరవమే ముఖ్యం: ఈటెల

Posted: 06/04/2021 03:49 PM IST
Treated as slaves former minister etela rajender resigns from trs

త‌న‌ ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించి పోమ్మనకుండా పోగబెట్టారని, అందులో భాగంగా రాత్రికి రాత్రే మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేశార‌ని, ఏం జ‌రిగిందో కూడా తెలుసుకోకుండా, త‌న వివ‌ర‌ణ తీసుకోకుండానే ఈ ప‌ని చేశార‌ని తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లా, శామీర్‌ పేట‌లోని త‌న నివాసంలో ఆయ‌న‌ మీడియా స‌మావేశంలో మాట్లాడారు. హుజురాబాద్ నియోజ‌కవ‌ర్గ ప్రజల తనకు జరిగిన అన్యాయంపై అవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వారంతా తనకు అండగా వుంటామని హామీ ఇచ్చారన్నారు.  అటువంటి హుజురాబాద్ నియోజ‌క వ‌ర్గంలో తనను ప్రాణం ఉండ‌గానే బొంద పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఈటెల అరోపించారు.

‘‘బ‌తికి ఉండ‌గానే న‌న్ను బొంద పెట్టాల‌ని సీఎం ఆదేశించ‌డంతోనే’’ కొందరు నేతలు ఇలా చేస్తున్నారు. హుజురాబాద్ లోని నాయ‌కుల‌కు డ‌బ్బుల ఆశ‌ను చూపెడుతూ, మ‌భ్య‌పెడుతున్నారు. అదీ కాక‌పోతే అనేక ర‌కాలుగా ఇక్క‌డి ప్ర‌జాప్ర‌తినిధుల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నా’’రని అరోపించారు. ఎవ‌రెన్ని కుట్ర‌లు, కుయుక్తులు పన్నినా.. ఎన్ని గజకర్ణ, గోకర్ణ, టక్కుటమారా వేషాలు వేసినా.. హుజురాబాద్ నియోజ‌క వ‌ర్గ ప్రజలు ఈటెలకు అండగా నిలుస్తారే తప్ప.. మరోటి కదాన్నారు. ఇందుకు గత లోక్ సభ ఎన్నికలే నిదర్శనమని చెప్పారు. ఇక్కడి ప్రజలు తనను క‌డుపులో పెట్టుకుని కాపాడుకుంటారని అన్నారు. తనను మంత్రివర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డంతో వారే ఏదో కోల్పోయిన‌ట్లు భావించారని అన్నారు.  

టీఆర్ఎస్ నుంచి ఎన్ని సార్లు బీ-ఫారం ఇచ్చినా గెలిచాను అని ఈట‌ల రాజేంద‌ర్ వ్యాఖ్యానించారు. అయితే బీ-పామ్ తీసుకున్న ప్రతీ ఒక్కరూ గెలవరని, కేసీఆర్ సొంత కూతురు కూడా నిజామాబాద్ లో గెలువలేకపోయిందని గుర్తుచేశారు. తనను పక్కన పెట్టడం ఇప్పుడు కాదని ఆరేళ్ల క్రితం నుంచే సాగుతోందని చెప్పారు. గ‌తంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేల‌తో క‌లిసి సీఎం ప్రగతి భవన్ కు వెళితే గేటు వ‌ద్దే మమ్మ‌ల్ని ఆపేశారు. రెండోసారి అపాయింట్ మెంట్ తీసుకుని వెళ్లాము. అప్పుడు కూడా గేటు వ‌ద్ద నుంచే వెనుదిరిగామని అన్నారు. బానిస కంటే నీచంగా మంత్రి ప‌ద‌వి ఉంది. ఎంపీ సంతోష్ కుమార్ తో తాను అప్ప‌ట్లో చెప్పానని తెలిపారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు ‘‘బానిస‌ల నిల‌యం’’ అని పేరు పెట్టుకోవాల‌ని కూడా బాధతో సూచించానని ఈట‌ల తెలిపారు.  

రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసిన కేసీఆర్ మరోవైపు సంఘాలు, యూనియన్లే లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. బొగ్గుగని కార్మిక సంఘాలతో కవితకు సంబంధమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఉద్యమ సంఘాలన్నీ ప్రస్తుతం కల్వకుంట్ల కవిత చేతిలో ఉన్నాయని ఆరోపించారు. ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని... బ్రహ్మదేవుడు కూడా ఆర్టీసీని కాపాడలేడని గతంలో కేసీఆర్ చెప్పారని ఈటల చెప్పారు. అనేక మంది కార్మికులు అసువులు బాసిన తరువాత దిద్దుబాటు చర్యలు ఎందుకని ప్రశ్నించారాయన. అందుకనే తనపై నీచపు వార్తలు రాయిస్తూ దూరం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. ప్రజలు నిరసన తెలిపే ధర్నాచౌక్ ను ఎత్తేసి వారి గోంతు నొక్కిన ఘనత కేసీఆర్ దని మండిపడ్డారు.  

మంత్రులను కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారని... అది చాలదన్నట్లు వారిపై నిఘా కూడా పెట్టారని అన్నారు. ఉద్యమ స్పూర్తితో ఉద్యమంలోకి వచ్చిన తనను కూడా కేసీఆర్ అగౌరవపరిచారని ఈటల మండిపడ్డారు. తాను బానిసను కాదనీ, ఉద్యమ సహచరుడినని ఆయన చెప్పారు. మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్ ల ఇది వారసత్వ పార్టీ కాదని, ఇది ముమ్మాటికీ ఉద్యమ పార్టీ అని ఆయన ఉద్ఘాటించారు, ఎంతో మంది ఉద్యమకారుల త్యాగఫలంతోనే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరూ లేనప్పుడు ఉన్నవాళ్లు ఇప్పుడు బయటకు వెళ్లగా, కేసీఆర్ ను నువ్వెంతా అంటూ నోటికివచ్చినట్టు తిట్టినవాళ్లు పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు. మాజీ ఎంపీ ఆలే నరేంద్ర. మాజీ ఎంపీ విజయశాంతి, ఇప్పడు తానను దూరం పెడుతున్నారని ఈటెల అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles