మహిళలు, యువతులపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. వారిపై యదేశ్చగా దారుణాలకు.. ఘోరాలకు పాల్పడుతున్న ఘటనలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఓ వైపు అఘాయిత్యాలు, దారుణాలు మరోవైపు ప్రేమ పేరుతో ప్రమోన్మాదుల ఘాతుకాలకు అంతులేకుండా పోతోంది. ప్రతీ రోజు దేశంలో ఎక్కడో ఒక్క చోట ప్రతీ నిమిషం అబలలపై అన్యాయాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా తాను ఎన్నిసార్లు తన మనస్సులో వున్న మాట చెప్పినా పెడచెవిన పెట్టి.. ప్రేమించేందుకు నిరాకరించిన ఓ యువతిపై ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతి గొంతును కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
అయితే ఈ విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న గ్రామస్థులు బండరాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా సాంబయ్య కండ్రిగలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన యువతిని చిన్నప్ప అనే యువకుడు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అసుపత్రిలో స్టాప్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న తన గ్రామానికి చెందిన సుస్మిత అనే యువతిని ప్రేమపేరుతో కొంత కాలంగా వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ వెంటపడుతున్నాడు. అయితే తనకు ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోకుండా వెంటపడుతున్నా.. అమె మౌనంగానే అతడి ప్రేమను నిరాకరించింది. చివరికి వెంటపడి వేధిస్తుండటం చేయడంతో యువతి తన కుటుంబసభ్యులకు విషాయాన్ని చెప్పింది. దీంతో ఇటీవల పోలీసులకు ఆ యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఆ అమ్మాయిపై మరింత ఆగ్రహంతో ఊగిపోయిన చిన్నా ఈ రోజు ఉదయం ఆ యువతి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఆమె రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. యువకుడు కూడా ఆత్మహత్యయత్నం చేయగా, యువతి భాధతో కేకలు వేయడంతో ఇరుగుపోరుగువారు, కుటుంబసభ్యులు, యువతి సోదరులతో పాటు గ్రామస్థులందరూ చిన్నప్పపై దాడి చేసి కొట్టి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. తాము ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సరైన సమయంలో చర్యలు తీసుకోలేదని ఆ యువతి కుటుంబ సభ్యులు మండిపడ్డారు. అందుకే ఆ యువకుడు రెచ్చిపోయాడని, తమ అమ్మాయి ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more