Hyderabad Witnesses Rare Atmospheric Phenomenon ‘Sun Halo’ నింగిలో అద్బుతం.. సూర్యుడి చుట్టూ ఇంధ్రధనస్సు వలయం

Hyderabad witnesses rare atmospheric phenomenon sun halo

sun halo, rainbow around the sun, halo around the sun, ring around the sun, sun halo in Hyderabad, sun today, halo sun, solar halo, circular rainbow around sun, halos, rainbow around the sun meaning, circle around the sun today, halo rainbow, sun halo 2021, halo ring, sun halo today, 22 degree circular halo, hyderabad, hyderabad sky, hyderabad sun, hyderabad sun halo, hyderabad weather, hyderabad sky halo, halo, sun halo

Nearly a week after Bengaluru skies witnessed a rare optical phenomenon, the Sun’s Halo or the rainbow-coloured ring was spotted around the sun from several parts of Hyderabad on Wednesday. The appearance of the circular Halo left Hyderabad residents surprised and many netizens even shared pictures of it on various social media platforms.

నింగిలో అద్బుతం.. సూర్యుడి చుట్టూ ఇంధ్రధనస్సు వలయం

Posted: 06/02/2021 01:38 PM IST
Hyderabad witnesses rare atmospheric phenomenon sun halo

నింగిలో అద్భుతం ఆవిష్కృతమైంది. గతంలో చైనా సహా మన దేశంలోని పలు ప్రాంతాల్లో సూర్యుడు ఒక్కడిగా కాకుండా మూడు నాలుగు ప్రతిబింభాలతో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. అలాగే గత వారం రోజుల క్రితం కర్ణాటక రాజధాని బెంగుళూరులో అవిష్కృతమైన అద్భుతం.. ఈ సారి తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా పరిసర ప్రాంత జిల్లావాసులకు కనువించి చేసింది. మధ్యాహ్నం పదిన్నర గంటల సమయం నుంచి పన్నెండున్నర వరకు ఈ దృశ్యం నగర వాసులను ఆశ్చర్యచకితులను చేసింది. ఈ సమయంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలో సామాజిక మాద్యమాల్లో విపరీతంగా వైరల్ కావడంతో.. వాటిల్లో పోస్టులను చూసిన వారు కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి సూర్యుడిని తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీ పడ్డారు.

సూర్యుడి చుట్టూర ఇంధ్రధనస్సులా ఏర్పడిన వలయాన్ని అత్యంత అందంగా తమ కెమెరాల్లో బంధించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఎంతో అద్భుతమైన దృశ్యం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చాలా మందికి ఇంధ్రదనస్సు అంటే ఎంతో ఇష్టం. ఆకాశంలో కనిపించగానే..కేరింతలు కొడుతారు. హైదరాబాద్ నగరంలో కూడా అచ్చు ఇలాగే జరిగింది. సూర్యుడిని కప్పేస్తూ..ఇంధ్రదనస్సు వలే రంగులు కనిపించాయి. దాదాపు రెండు గంటల పాటు హైదరాబాద్ ప్రజలను కనువిందు చేసింది. ఆకాశంలో ఈ అద్భుత దృశ్యాన్ని తమ సెల్ ఫోన్ లు, కెమెరాలలో బంధించారు.

ఈ విధంగా కనిపించడాన్ని 22 డిగ్రీల హాలో అంటారని పలువురు వెల్లడించారు. ఇది కాంతిని చెదరగొట్టడం వల్ల ఏర్పడే అవకాశం ఉందని, కాంతి యొక్క వృత్తాకారంలో సూర్యుడు లేదా చంద్రుడు చుట్టూ కనిపిస్తుంది. వాతావరణంలో ఏర్పడే మంచు స్ఫటికాల ద్వారా కాంతి ప్రతిబింబించి.. వక్రీభవనం వలన హాలో సంభవిస్తుంది. హాలో అనేది సూర్యుడు లేదా చంద్రుడు నుంచి 22 డిగ్రీల కాంతి వలయం అని, మంచు స్పటికాలతో ఏర్పడే అత్యంత సాధారణమైన కాంతి రకమని ఖగోళశాస్త్రవేత్తలు తెలిపారు. మంచు స్పటికాల గుండా వెళుతున్న సమయంలో…కాంతి రెండు వక్రీభవనాలకు లోను కావడం జరుగుతుందన్నారు. మొత్తానికి ఆకాశంలో జరిగిన ఈ అద్భుత దృశ్యాన్ని చూసి నగర ప్రజలు ఎంజాయ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles