Pakistan repatriates Hyderabad techie who crossed LoC పాకిస్థాన్ జైళ్లో నరకం అనుభవించాను: ప్రశాంత్

Vizag techie v prasanth shares how he ended up in a pakistan jail

Hyderabad techie In Pakistan, Hydrabad engineer in Pakistan custoday,Hyderabad techie in Pak custody,Pak repatriates Hyderabad techie,Bahawalpur police,Pakistan (Control of Entry) Act,illegal border crossings,Cyberabad Police

Hyderabad techie who went missing in 2017 and had been lodged in a Pakistan jail after crossing the border illegally was handed over to the Indian authorities on Monday. Prashanth said during the time of investigation they used to beat horribly and showed hell for two years. There are many indians who are lodged in pakistan jails and said had given the data to indian government.

పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న అనేక మంది భారతీయులు: ప్రశాంత్

Posted: 06/02/2021 12:46 PM IST
Vizag techie v prasanth shares how he ended up in a pakistan jail

ప్రేమ కోసమై సరిహద్దులు దాటి దాయాధి పాకిస్థాన్ భూమిలోకి వెళ్లిన హైదరాబాదుకు చెందిన టెక్కీ ప్రశాంత్ అక్కడ జైలులో పడి నాలుగేళ్ల తరువాత తిరిగి భారత్ చేరుకున్నాడు. పాక్ చెర నుంచి సురక్షితంగా సొంతింటికి చేరుకున్న ప్రశాంత్ తల్లిదండ్రులను చూసి కంటతడిపెట్టుకున్నాడు. మళ్లీ మిమ్మల్ని చూస్తాననుకోలేదని, ఆ దేవుని దయ ఉంది కాబట్టే బయట పడగలిగానన్నారు. పాకిస్తాన్ జైలులో తనకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని, చెప్పిన ప్రశాంత్.. విచారన సందర్భంగా మాత్రం బాగా కొట్టారని అన్నారు. రెండేళ్ల పాటు తనకు నరకం చూపించారని చెప్పాడు. ఆ తర్వాత క్రమంగా పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని తెలిపాడు.

తన లాంటి వారు మన దేశానికి చెందిన వారు ఇంకా చాలా మంది పాకిస్తాన్ లోని జైళ్లలో మగ్గిపోతున్నారని.. వారిని కూడా విడిపించాలంటూ ప్రభుత్వాలను కోరానన్నారు. పాక్ జైళ్లలో ఉంటున్న భారతీయుల వివరాలు తాను సేకరించిన వాటిని భారత ప్రభుత్వానికి అందజేశానని చెప్పారు. జైలు జీవితం తన జీవితాన్ని సమూలంగా మార్చేసిందని, భారత ఖైదీలతో పనిచేయించరు కాబట్టి తాను పుస్తకాలు చదువుతూ గడిపానన్నారు. త్వరలోనే ఉద్యోగంలో చేరి కొత్త జీవితాన్ని మొదలుపెడతానని. తాను పడిన కష్టాలు మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నానని చెప్పాడు.

పాకిస్తాన్ జైలు నుంచి తమ కొడుకు ప్రశాంత్ తిరిగి రావడం ఆశ్చర్యంగా.. సంబరంగా ఉందని అతని తండ్రి బాబురావు పేర్కొన్నారు. తమ కొడుకు పాక్ జైళ్లలో ఉన్నాడన్న విషయం తెలిసిన తర్వాత చాలా బాధ కలిగిందని.. మానసికంగా వర్ణించలేనంతగా నలిగిపోయామన్నారు. రాత్రయితే చాలు పీడకలలు వచ్చి భయపడేవారమని.. మళ్లీ మా వాడిని చూస్తామనుకోలేదని కంటతడిపెట్టుకున్నారు. అయితే తమ అబ్బాయిని తిరిగి రప్పించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సహాయత స్వచ్ఛంద సంస్థ వారు చాలా కృషి చేశారని.. వారు చేసిన మేలు జన్మలో మరచిపోలేనన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles