DRDO issues directions on usage of anti-Covid drug 2-DG ఈ రుగ్మతలు వున్నవారు డీఆర్డీవో 2డీజీ మందును తీసుకోరాదు..

Drdo shares directions to administer 2 dg drug to covid patients

2-dg drdo, 2-dg drug, 2-dg covid-19 drug, 2-dg side effects, 2-dg DRDO price, Covid drug india price, side effects of 2dg, 2dg oral satchet, 2dg covid drug price, drdo covid drug guidelines, Rajnath Singh,Harsh Vardhan,DRDO,Defence Research and Development Organisation,Defence ministry,DCGI,Allied Sciences

DRDO 2-DG drug: DRDO has said that caution should be exercised while prescribing the medicine to people who have comorbidities such as uncontrolled diabetes, severe cardiac problem and acute respiratory distress syndrome.

ఈ రుగ్మతలు వున్నవారు డీఆర్డీవో 2డీజీ మందును తీసుకోరాదు..

Posted: 06/01/2021 06:18 PM IST
Drdo shares directions to administer 2 dg drug to covid patients

కరోనా చికిత్సలో రోగులకు సత్వర ఉపశమనం కలిగించేలా డీఆర్డీవో 2 డీజీ (2 డీఆక్సీ డీ గ్లూకోజ్) ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఔషధ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని డీఆర్డీవో స్పష్టం చేసింది. తాజాగా దీని వాడకంపై మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా చికిత్సలో 2డీజీ ఔషధాన్ని ఇష్టం వచ్చినట్టు వాడొద్దని, వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి అని పేర్కొంది. ఓ మోస్తరు నుంచి తీవ్ర కరోనా లక్షణాలు ఉన్నవారికి దీన్ని వాడొచ్చని తెలిపింది. ప్రస్తుత చికిత్సకు అనుబంధంగానే దీన్ని వాడాలని సూచించింది. డాక్టర్లు గరిష్ఠంగా 10 రోజుల లోపు 2డీజీ వాడకాన్ని సూచించాలని వివరించింది.

కొన్ని జబ్బులు ఉన్నవారికి 2డీజీ ఔషధం వాడేముందు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. డయాబెటిస్, తీవ్రస్థాయి గుండెజబ్బులు, లివర్, కిడ్నీ వ్యాధులు, తీవ్ర శ్వాసకోశ సమస్యలు, ఉన్నవారిపై ఈ ఔషధాన్ని పరీక్షించలేదని వెల్లడించింది. అలాగే 18 ఏళ్ల లోపు వారు, గర్భవతులు, పాలిచ్చే తల్లులకు ఈ మందు వాడొద్దని డీఆర్డీవో స్పష్టం చేసింది. 2డీజీ ఔషధం కోసం This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.కి మెయిల్ చేయాలని తెలిపింది. అది కూడా కరోనా బాధితులు, లేదా వారి కుటుంబ సభ్యులు మెయిల్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles