Pakistan repatriates Hyderabad techie who crossed LoC ప్రేమ కోసమై పాకిస్తాన్ కు వెళ్లేనే పాపం సాప్ట్ వేర్ ఇంజనీరు..

Missing hyderabad techie who was jailed in pakistan returns home after 4 years

Hyderabad techie In Pakistan, Hydrabad engineer in Pakistan custoday,Hyderabad techie in Pak custody,Pak repatriates Hyderabad techie,Bahawalpur police,Pakistan (Control of Entry) Act,illegal border crossings,Cyberabad Police

Hyderabad techie who went missing in 2017 and had been lodged in a Pakistan jail after crossing the border illegally was handed over to the Indian authorities on Monday who in turn handed him over to the Madhapur police. Prashanth went missing on 11 April 2017. His family lodged a missing complaint at the Madhapur police station on 29 April 2017 and a case was registered.

ప్రేమ కోసమై పాకిస్తాన్ కు వెళ్లేనే పాపం సాప్ట్ వేర్ ఇంజనీరు..

Posted: 06/01/2021 07:30 PM IST
Missing hyderabad techie who was jailed in pakistan returns home after 4 years

ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అన్న పాట గుర్తుందిగా.. సరిగ్గా అలానే హద్దులు దాటి సరిహద్దులు దాటి దాయాధి పాకిస్థాన్ భూమిలోకి వెళ్లిన హైదరాబాదుకు చెందిన టెక్కీ ప్రశాంత్ అక్కడ జైలులో పడ్డాడు. తనను ప్రేమించిన అమ్మాయి కోసం ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండానే దేశ సరిహద్దులు దాటి పాకిస్థాన్ లో     అగుడుపెట్టి.. దారి తెన్ను తెలియక ఎక్కడికి వెళ్లాల్లో ఎలా వెళ్లాలో కూడా అర్థంకాకుండా బిత్తరపోయాడు. అనుమానాస్పదంగా తచ్చాడుతున్నాడని అక్కడి బాహవాల్ పూర్ పోలీసులు అతడ్ని అరెస్టు చేసి.. అక్రమంగా తమ భూభాగంలోకి ప్రవేశించిన కారణంగా నాలుగేళ్లు జైలు శిక్షను అనుభవించాడు. ఈ క్రమంలో భారత విదేశాంగశాఖ అధికారుల ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు ప్రశాంత్ విడుదలయ్యాడు.

2017లో పాకిస్థానీ గాళ్ ఫ్రెండ్ ను కలిసేందుకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినా ప్రశాంత్ సాహసం చేశాడు. అమెను కలిసేందుకు పాస్ పోర్ట్, వీసా సహా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా పాక్ భూభాగంపై కాలుమోపాడు. అయితే తొలుత వీరిద్దరూ స్విజ్జర్ లాండ్ లో కలుద్దామని అనుకున్నారు. అయితే స్విట్జర్ ల్యాండ్ వెళ్లేంత డబ్బు అతిని వద్ద లేకపోవడంతో ఏకంగా పాకిస్థాన్ కు వెళ్లాలని నిర్ణయించుకుని రాజస్థాన్ కు వెళ్లే రైలు ఎక్కడి బికనీర్ చేరుకున్నాడు. అక్కడి నుంచి సరిహద్దు మీదుగా పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లిపోయాడు, అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని పాక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే అప్పటివరకు తమ బిడ్డ కనిపించడం లేదని ప్రశాంత్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలిస్ స్టేషన్ లో 11 ఏప్రిల్ 2017న పిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని అతను పని చేసే సంస్థతో పాటు ఇంటి వద్దక కూడా వాకాబు చేసి ఎలాంటి ఆధారం లభ్యం కాకపోవడంతో మిన్నకుండిపోయారు, అయితే పాకిస్థాన్ లోని బహవాల్ పూర్ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో ప్రవేశపెట్టడంలో అతడి జైలు శిక్ష పడింది, దీంతో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అతని ఇంటికి పంపించారు, ఈ విషయం తెలిసిన అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ప్రశాంత్ కుటుంబ సభ్యులు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను కలిసి పరిస్థితి వివరించారు.

విషయ తీవ్రతను అర్థం చేసుకుని, తల్లిదండ్రుల అవేదనన, అందోళనను కూడా పరిగణలోకి తీసుకున్న ఆయన.. సానుకూలంగా స్పందించడంతో పాటు వారికి ధైర్యాన్ని అందించారు, భారత విదేశాంగ శాఖ అధికారులకు ఈ విషయం తెలియజేశారు. అనేక ప్రయత్నాల అనంతరం ప్రశాంత్ ను విడుదల చేసిన పాక్ అధికారులు... వాఘా బోర్డర్ వద్ద అతడిని భారత అధికారులకు అప్పగించారు. దీంతో హైదరాబాద్ చేరుకున్న ప్రశాంత్.. రేపు టాడని భావి బుధవారం తన సొంతూరైన విశాఖకు బయలుదేరి వెళ్లనున్నాడు, అయితే ప్రశాంత్ విడుదల నేపథ్యంలో తన తండ్రి బాబురావు స్పందిస్తూ తనకు తన బిడ్డతో కేవలం ఒక్క నిమిషం మాట్లాడే అవకాశమే లభించిందని, దీంతో అక్కడి పాక్ అధికారులు తన బిడ్డను ఎలాంటి చిత్రహింసలకు గురిచేశారో కూడా తెలియదని అన్నారు. కాగా తమ బిడ్డ తిరిగి వస్తున్నందుకు అదే తమ కుటుంబానికి సంతోషకరమని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh