Anandaiah's Ayurveda medicine to be delivered online ఇకపై ఆన్ లైన్ ద్వారానే ఆనందయ్య ఆయుర్వేద ఔషధం..!

Anandaiah s ayurveda medicine to be delivered online to covid patients

Anandaiah, ayurvedic corona medicine, Krishnapatnam medicine, nellore corona medicine, herbal medicine, anandaiah medicine, COVID 19, Coronavirus, Pandemic, Lockdown, corona vaccine, vaccination, vaccines, oxygen, herbal medicine, eye drops, B. Anandaiah, Andhra Pradesh, politics

The SPS Nellore district collector had a meeting with Ayurvedic practitioner B Anandaiah and MLA Kakani on the preparation and delivery of the traditional medicine, touted as a miracle cure particularly for Covid-19 patients, after the Andhra Pradesh government gave nod on Monday.

ఇకపై ఆన్ లైన్ ద్వారానే ఆనందయ్య ఆయుర్వేద ఔషధం..!

Posted: 06/01/2021 01:11 PM IST
Anandaiah s ayurveda medicine to be delivered online to covid patients

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఔషదానికి ఎట్టకేలకు అనుమతి లభించిన విషయం తెలిసిందే. అయితే డబ్బులు లేని పేదోళ్ల, సామాన్య ప్రజలతో పాటు డబ్బులున్న పెద్దల వరకు.. రాజకీయ నాయకుల నుంచి వివిఐపీల వరకు అందరి పాలిట అపద్భాందవుడిగా మారారు కృష్ణపట్నం ఆనందయ్య. పైకి శాస్త్రియ పరిశోధన పేరు చెబుతున్నా ఎందరో అధికారగణం, పాలక పక్షం, ప్రతిపక్ష నేతలు ఆయన మందును తయారు చేయించుకుని మూడో కంట పడకుండా తమ ఇళ్లకు తీసుకెళ్లారని వార్తలు గుప్పుమంటున్నాయి.

గతంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్య ఔషదానికి అనుమతి మంజూరు చేసినప్పటికీ ఆయుష్ సంస్థ పరిశోధనల అనంతరం అనుమతినిస్తామని గత వారం పది రోజులగా ఆనందయ్య ఔషదం విషయంలో హైడ్రామాను కొనసాగించిన అనంతరం నిన్న ఆయన ఔషధానికి మరోమారు అనుమతి లభించింది. ఇక అటు ప్రభుత్వం అనుమతితో పాటు ఇటు హైకోర్టు కూడా ఆయన మందును పంఫిణీ చేయవచ్చునని అదేశాలు జారీ చేసింది. అయితే ఆనందయ్య మందు ఇస్తున్నారన్న విషయం తెలుసుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు పోరుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి వచ్చే అవకాశం వుంది.

ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి ప్రబలే అవకాశాలు వుంటాయని అంచనా వేసిన జిల్లా యంత్రాంగం ఆనందయ్యతో సమావేశం అయ్యింది. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరై పంఫిణీ విధానాలపై చర్చించారు. ఇదివరకు ప్రజలు వచ్చి తన వద్ద మందు తీసుకెళ్లే విధానానికి స్వస్తి పలికి, ఇకపై అందివచ్చిన ఆన్ లైన్ విధానంలో ఆనందయ్య మందు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో బాధితులు, రోగుల బంధువులు ఇకపై ప్రజలు కృష్ణపట్నం రావొద్దని, ఆన్ లైన్ విధానంలో ఇంటి వద్దకే మందు అందజేస్తారని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. మందు పంపిణీ విధివిధానాలపై త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా ఆనందయ్య మాట్లాడుతూ, కరోనా బాధితులు తమ ఇళ్ల వద్దే సురక్షితంగా విశ్రాంతి తీసుకోవడం మంచిదని, ఎవరు కోరినా వారికి అధికారుల సహకారంతో మందును ఎక్కడికక్కడ పంపిణీ చేస్తామని తెలిపారు. మూడు రోజుల్లో ప్రభుత్వ అధికారులతో తమ కుటుంబసభ్యులు చర్చిస్తారని... ఆ తర్వాత, నాలుగైదు రోజుల వ్యవధిలో మందును పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. మందు తయారీకి కావాల్సిన వనమూలికలను అటు ప్రభుత్వంతో పాటు ఆయన శిష్యగణం సమకూర్చుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఆనందయ్య, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎస్పీ భాస్కర్ భూషణ్ తదితరులు హాజరయ్యారు. మరో నాలుగైదు రోజుల్లో కరోనా మందు పంపిణీ ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles