Delhi govt permits home delivery of liquor ఆన్ లైన్, యాప్ ద్వారా మద్యం డెలివరీకి ‘ఢిల్లీ’ అనుమతి

Delhi allows home delivery of liquor through mobile apps online portals

Delhi govt allows home delivery of liquor, liquor delivery, delhi liquor delivery, delhi government, delhi government on liquor delivery, home delivery of liquor, home delivery of liquor delhi, home delivery of liquor in delhi in lockdown, liquor home delivery, liquor home delivery in delhi, liquor home delivery in delhi during lockdown, liquor home delivery delhi today, liquor home delivery in Dwarka, liquor home delivery in east delhi, liquor home delivery in south delhi

The Delhi government has permitted home delivery of Indian liquor and foreign liquor as Covid-19 restrictions continue to be in place in the city. Liquor can be ordered for home delivery in Delhi through online portals as part of the new excise policy.

ఆన్ లైన్, యాప్ ద్వారా మద్యం డెలివరీకి ‘ఢిల్లీ’ అనుమతి

Posted: 06/01/2021 02:13 PM IST
Delhi allows home delivery of liquor through mobile apps online portals

లాక్ డౌన్ అనగానే వైన్ షాపుల ముందు జనం ఎంతలా బారులు తీరుతారో మనకు తెలుగు రాష్ట్రాల ప్రజలను చూస్తేనే అర్థం అవుతుంది. ఎందుకంటే గత ఏడాది మద్యం దుకాణాలు తెరచి తెరువగానే ఎంతటి క్యూ మద్యం దుకాణాల మందు వుందో మనం మీడియాలో, పత్రికలలో చూశాం. ఇక సరిగ్గా ఈ సారి మే నెలలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ అనగానే అనేక మంది మద్యం దుకాణాల వద్ద క్యూ కట్టారు. అయితే ఈ పరిస్థితి ఇక్కడే కాదు ఏ రాష్ట్రమందు చూసినా మద్యం బాబులు రూటు వైన్ షాపుల వైపు అనక తప్పదు. మద్యానికి గిరాకీ అలాంటిది మరీ.

ఇక ఇప్పటికే కరోనా కేసులతో అల్లాడిపోతూ అంతకంతకూ పెరుగుతున్న కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకున్న ఢిల్లీ ప్రభుత్వం కూడా కరోనా సంఖ్య పెరగడానికి ఒక్క కారణంగా మారిన మద్యం దుకాణాలపై దృష్టిసారించింది. దీంతో ఇక మధ్యాన్ని హోం డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మద్యం డోర్ డెలివరీకి అక్కడ అనుమతులున్నా.. దానికి పరిమితులున్నాయి. ఈమెయిల్ ద్వారా ఆర్డర్ పెడితేనే మద్యం ఇంటికి వచ్చేది. అది కూడా స్పెషల్ లైసెన్స్ ఉన్న షాపులకే ఆన్ లైన్ మద్యం డెలివరీకి అనుమతి ఉండేది. కానీ, ఇప్పుడు లాక్ డౌన్ వల్ల జనం వైన్స్ ముందు క్యూలు కట్టడం, గుంపులుగా చేరుతుండడంతో ఫోన్ నుంచి ఆర్డర్ పెట్టినా ఇంటికి మద్యాన్ని డెలివరీ చేసేందుకు ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ ఎక్సైజ్ (సవరణ) చట్టం 2021 ప్రకారం.. ఎల్ 14 లైసెన్స్ లు ఉన్న అన్ని మద్యం షాపులూ ఇంటికి మద్యం డెలివరీ చేసేందుకు అనుమతులను ఇచ్చింది. మొబైల్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా ప్రజలు ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టేందుకు అవకాశం ఇచ్చింది. వాస్తవానికి గత ఏడాది లాక్ డౌన్ విధించగానే మద్యం షాపుల ముందు జనం భారీగా గుమిగూడారు. దీంతో డోర్ డెలివరీ చేసే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ఢిల్లీ సర్కార్ కు సుప్రీం కోర్టు సూచించింది. అప్పుడే ఈ మెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వారా ఆర్డర్ చేస్తే ఎల్ 13 లైసెన్స్ కలిగి ఉన్న షాపులు డోర్ డెలివరీ చేసేందుకు ఓకే చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles