Serum Institute to raise 10 cr Covisheild vaccine in June జూన్ లో పది కోట్ల వాక్సీన్లు అందిస్తాం: ఆడార్ పూనావాలా

Will supply 10 cr doses of covishield vaccine in june serum institute

corona vaccine, covid vaccine stock, covishield, adar poonawalla, oxford vaccine, Serum Institute Covishield vaccine, Amit Shah, National politics

The Serum Institute of India has informed the central government that it will be able to manufacture and supply 10 crore doses of its anti-coronavirus vaccine, Covishield in June. In early May, SII had communicated to the Centre that production of Covishield would be ramped up to 6.5 crore in June,

జూన్ లో పది కోట్ల వాక్సీన్లు అందిస్తాం: ఆడార్ పూనావాలా

Posted: 05/31/2021 08:12 AM IST
Will supply 10 cr doses of covishield vaccine in june serum institute

కరోనా రెండవ దశ నుంచి ప్రజలకు సురక్షితంగా వుంచేందుకు వాక్సీన్లు ఒక్కటే మార్గమని సందేశమిచ్చిన కేంద్రం.. ఆ స్థాయిలో టీకాల ఉత్పత్తి చేయించలేదన్న విమర్శలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ఇద ప్రభుత్వ యంత్రాంగం దానిపై దృష్టి సారించింది. అయితే ఓ వైపు కోరానా వాక్సీన్ ఉత్పత్తి చేస్తున్న సెరమ్ ఇనిస్టిట్యూట్ ఉపాధ్యక్షుడు కూడా కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సెరమ్ ఫార్మ సంస్థ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో కొరతతో ఇబ్బంది పడుతున్న దేశ ప్రజలకు ఊరటనిచ్చే వార్తను వెలువరించింది.

జూన్‌లో 9 నుంచి 10 కోట్ల కొవిషీల్డ్ టీకాలు ఇస్తామంటూ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. జూన్ నెల నుంచే 10 కోట్ల టీకాలు ఇస్తామని చెప్పేందుకు సంతోషిస్తున్నామని ఆ లేఖలో పేర్కొంది. టీకాల ఉత్పత్తిని పెంచేందుకు తమ సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారని తెలిపింది. కాగా, మేలో 6.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను మాత్రమే సీరం ఉత్పత్తి చేయగలిగింది. దీనిని దశల వారీగా పెంచుతూ ఆగస్టు, సెప్టెంబరు నాటికి పది కోట్ల వ్యాక్సిన్ డోసులకు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించినట్టు గతంలో తెలిపింది.

అయితే, అనుకున్న దానికి రెండుమూడు నెలల ముందుగానే 10 కోట్ల టీకాలను సరఫరా చేస్తామని చెప్పడం గమనార్హం. విలువైన మార్గదర్శకత్వం, నిరంతర మద్దతు అందిస్తున్నందుకు అమిత్‌ షాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు సీరం అధికారి ప్రకాశ్ కుమార్ సింగ్ తెలిపారు. జూన్‌లో 6.5 కోట్లు, జులైలో 7 కోట్లు, ఆగస్టు, సెప్టెంబరులో 10 కోట్ల చొప్పున టీకాలను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తామని సీరం గతంలో ప్రకటించింది. అయితే, జూన్‌లోనే తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 కోట్లకు పెంచనుండడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles