Viral audio clips hint Sasikala returns to AIADMK అన్నాడీఎంకే పగ్గాలు కోసం పావులు కదుపుతున్న శశికళ

Audio tapes indicate v k sasikala is readying for political comeback

Sasikala, AIADMK, AMMA, KP Munusamy, J Jayalalithaa, AIADMK general secretary, disaapropriate assets, Tamil Nadu, Politics

Amid growing speculations of former All India Anna Dravida Munnetra Kazhagam (AIADMK) general secretary VK Sasikala's return to active politics in Tamil Nadu, the party has hit back at the leader, claiming that she is trying to break the party.

అన్నాడీఎంకే పగ్గాలు అందుకునేందుకు పావులు కదుపుతున్న శశికళ

Posted: 05/31/2021 07:25 AM IST
Audio tapes indicate v k sasikala is readying for political comeback

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి, చిన్నమగా గుర్తింపు పోందిన శశకళ త్వరలోనే పార్టీ పగ్గాలను అందుకోనున్నారా.? అంటే ఔనన్న సమాధానాలే వినబడుతున్నాయి. జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్థారించబడి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్ల శిక్ష అనుభవించి విడుదలైన శశికళ రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. అయితే జైలు నుంచి విడుదలయ్యే క్రమంలో అమె ఏకంగా జయలలిత తరహాలో అదే వాహనం, వాహనానికి ముందుకు అన్నాడీఎంకే పార్టీ జెండాతో వచ్చారు.

అయితే అమెకు ఆ అర్హత లేదని, నిజమైన అన్నాడిఎంకే పార్టీ తమదేనని అప్పటి తమిళనాడు అధికార పార్టీ విమర్శలు చేసింది. ఈ క్రమంలో వివాదాలకు దూరంగా వుండాలని భావించిన ఆమె రాజకీయాలకు సెలవు చెప్పారు. తన పయనం ఆధ్యాత్మికత వైపేనని ప్రకటించారు. ఇక తాజాగా అమె తన మనసు మార్చుకున్నారు. ఆమె దృష్టి తిరిగి రాజకీయాలపై పడిందని, తాను మళ్లీ వచ్చేస్తానని  మద్దతుదారులకు చూచాయగా చెప్పినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అడియో టేపులు కూడా బయటకు వచ్చి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

అంతర్గత కుమ్ములాటలతో పార్టీ నాశనం అవుతూ ఉంటే చూస్తూ కూర్చోలేనని, తానొచ్చి పార్టీని గాడిలో పెడతానని మద్దతుదారులతో చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు వారితో ఫోన్‌లో మాట్లాడుతూ ధైర్యం నింపుతున్నారు. పార్టీ తీరుపై దిగులు చెందొద్దని, తానొచ్చి పార్టీని బాగుచేస్తానని, జాగ్రత్తగా ఉండాలని సూచించినట్టు సమాచారం. అంతేకాదు, కరోనా ప్రభావం తగ్గిన తర్వాత వచ్చి అందరినీ కలుస్తానని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. శశికళ తాజా నిర్ణయం తమిళ రాజకీయాల్లో మరోమారు చర్చనీయాంశమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles