India "Late To The Table" In Buying Vaccines: Virologist వాక్సీన్ల కోసం అర్డర్ చేయడంలో భారత్ అలక్ష్యం: ప్రముఖ వైరాలజిస్ట్

India late to table to buy vaccines from international markets gagandeep kang

Covid Vaccine, Global E Tender, India, Vaccine, Vaccine Diplomacy, Gagandeep Kang, eminent virologist, UK, US, Covishield, Covaxin, vaccine policy, international market, India

Dr Gagandeep Kang, an eminent virologist, said that India has fallen behind when it came to placing orders for bulk-buying of COVID-19 vaccines and therefore would now be left with fewer chocies in the international market.

వాక్సీన్ల కోసం అర్డర్ చేయడంలో భారత్ అలక్ష్యం: ప్రముఖ వైరాలజిస్ట్

Posted: 05/28/2021 11:05 AM IST
India late to table to buy vaccines from international markets gagandeep kang

అభివృద్ది చెందిన దేశాలు తమ దేశ పౌరులందరికీ కరోనా టీకాలు ఇచ్చేంత వరకు భారత ప్రజలకు ఎదురుచూపులు తప్పకపోవచ్చని ప్రముఖ వైరాలజిస్ట్ గగన్ దీప్ కాంగ్ తెలిపారు. సంపన్న దేశాలన్నీ ఇప్పటికే టీకాలను పెద్ద ఎత్తున నిల్వ చేసుకున్నాయని, తమ దేశంలోని పౌరులకు మూడింతల అధిక సంఖ్యలో నిల్వ చేసుకున్నాయని దీంతో భారత్ కు ఎదురుచూపులు తప్పడం లేదని అమె అభిప్రాయపడ్డారు. ఈ సంపన్న దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయితే తప్ప భారత్ లాంటి దేశాలకు టీకాలు అందుబాటులోకి రావన్నారు.

అయితే ఈ పరిస్థితి ఈ ఏడాది చివరినాటికి మారుతుందని అప్పటికీ మన దేశంలో టీకాల సరఫరా పరిస్థితి మెరుగుపడుతుందని అమె ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది డిసెంబరు నాటికి 200 కోట్ల డోసులను సమకూర్చుకుంటామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై కాంగ్ స్పందిస్తూ.. అలా జరిగే అవకాశమే లేదన్నారు. ఏడాది చివరినాటికి 200కోట్ల డోసులను సమకూర్చుకోవడం దాదాపు అసాధ్యమని, కాకపోతే, అది సాకారం కావాలనే తాను కోరుకుంటానని కాంగ్ చెప్పుకొచ్చారు. దేశంలో టీకాలను ఉత్పత్తి చేస్తున్న సంస్థలు రెండూ అద్భుతమైనవేనని, టీకాల ఉత్పత్తి సామర్థ్యం వాటికి ఉందని అన్నారు.

బయలాజికల్ ఈ, జైడస్ కాడిలా వంటి కంపెనీలకు కూడా వాక్సీన్ తయారీకి అనుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తే పరిస్తితిలో మార్పు ఉండేదని అభిప్రాయపడ్డారు. టీకాలు అభివృద్ధి దశలో ఉన్నప్పుడే అనేక దేశాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయని, భారత్ మాత్రం వాటిని కొనుగోలు చేసే రిస్క్ చేయలేకపోయిందన్నారు. గతేడాదే మనదేశం కూడా వ్యాక్సిన్లను భారీ స్థాయిలో కొనుగోలు చేసి ఉంటే దేశంలో ఇప్పుడీ పరిస్థితులు ఉండేవి కావని, వ్యాక్సినేషన్ లో ఇబ్బందులు తలెత్తి ఉండేవి కావని అన్నారు. టీకాలు ప్రయోగ దశలో ఉన్నాయన్న ఒకే ఒక్క కారణంతో ప్రభుత్వం వాటిని కొనుగోలు చేసేందుకు రిస్క్ చేయలేకపోయిందని కాంగ్ అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Covid Vaccine  Global E Tender  India  Vaccine  Vaccine Diplomacy  Gagandeep Kang  UK  US  Covishield  Covaxin  vaccine policy  India  

Other Articles