No adverse effect on COVID vaccine cocktail: Niti Aayog వేర్వేరు టీకాలతో.. ప్రతికూల ప్రభావం నిల్: నీతి అయోగ్

Adverse effect unlikely if second dose of a different covid vaccine taken vk paul niti aayog

different vaccine, covid vaccination, covaxin, vaccine cocktail, vaccination interval, Covid Surge in India, covishield, vk paul, Niti Aayog, Uttar Pradesh, SiddharthNagar, Villagers, niti aayog health member vk paul, COVID-19, Corona virus, COVID-19 News

V K Paul, NITI Aayog member (Health), said that any significant adverse effect is unlikely if the second dose of a different covid vaccine is administered. The clarification comes following reports that health workers in Uttar Pradesh's Siddharthnagar district administered Covaxin to 20 villagers who had been given Covishield in the first dose.

వేర్వేరు వాక్సీన్లతో ప్రతికూల ప్రభావం ఉండదు: నీతి అయోగ్ సభ్యడు

Posted: 05/28/2021 10:18 AM IST
Adverse effect unlikely if second dose of a different covid vaccine taken vk paul niti aayog

దేశంలో కరోనా వాక్సీన్ల కొరత ఏర్పడిన తరుణంలో.. కేంద్రప్రభుత్వం 18 ఏళ్లకు పైబడిన యువతకు కూడా మే 1వ తేదీ నుంచి కోవిడ్ వాక్సీన్ ఇవ్వాలని ఏప్రిల్ మాసంలో అదేశాలు జరీ చేయడంతో టీకాలు వేయించుకునేందుకు దేశవ్యాప్తంగా సంఖ్య అధికమైంది. 18 ఏళ్లకు పైబడిన యువతతో పాటు యాభై ఏళ్లకు పైబడిన వయస్కులు.. అందులో విద్యావంతులతో పాటు నిరక్షరాస్యులు కూడా వుండటంతో ఎవరికి ఏ వాక్సీన్ ఇచ్చామో కూడా చేసుకునే వీలు లేకుండా.. తీసుకున్నా వారికి దానిపై అవగాహన లేకపోవడంతో కరోనా తొలి డోసు ఒక వాక్సీన్ రెండో డోసు మరో వాక్సీన్ ఇచ్చిన దాఖలాలు దేశవ్యాప్తంగా అనేకం నమోదయ్యాయి.

ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో తొలి డోసు కోవిషీల్డ్ ఇచ్చి రెండో డోసు మాత్రం కోవాగ్జిన్ ఇచ్చారు. అయితే స్థానిక వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందన్న వార్తు.. వారందరినీ పర్యవేక్షిస్తున్నామని అయితే ఎవరిలోనూ ఎలాంటి అరోగ్య సమస్యలు తలెత్తలేదని ఉత్తర్ ప్రదేశ్ వైద్యాధికారులు తెలిపారు. ఇక ఇలాంటి ఘటనలు పలుచోట్ల చోటుచేసుకోవడంతో నీతి అయోగ్ స్పందించింది. తొలి డోసుగా కొవిషీల్డ్, రెండో డోసుగా కొవాగ్జిన్ తీసుకున్నప్పటికీ ఎలాంటి ప్రతికూల ప్రభావమూ ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న ఘటనపై స్పందించిన నీతి అయోగ్. వేర్వేరు వ్యాక్సిన్లు ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

తాజాగా, ఈ విషయమై నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ.. రెండు వేర్వేరు డోసులు తీసుకున్నంత మాత్రాన ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండబోవన్నారు. నిజానికి మొదటి డోసు ఏ వ్యాక్సిన్ వేసుకుంటే రెండో డోసు కూడా అదే వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయన్నారు. అయితే, రెండో డోసు ఏదైనప్పటికీ ప్రతికూల ప్రభావం మాత్రం ఉండబోదని తాను చెప్పగలనన్నారు. రెండో డోసు వేసుకోవడం ద్వారా రోగ నిరోధకశక్తి మరింత బలోపేతమవుతుందన్నారు. తొలి డోసు ఏది ఇచ్చారో మలి డోసు కూడా అదే ఇచ్చేలా చూడాలని అన్నారు. ఉత్తరప్రదేశ్ ఘటనపై విచారణ జరపాల్సిందేనని పాల్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles