Raghurama Krishnam Raju discharged from Army Hospital అసుపత్రి నుంచి రఘురామకృష్ణరాజు విడుదల.. నేరుగా హస్తినకు..!

Rrr discharged from army hospital leaves for delhi by special flight

Raghurama Krishnam Raju to be released after 4 days, Raghuram Krishna Raju, Sedition Charges, Narsapuram MP, Guntur jail, Secundrabad Army Hospital, District Cou rt Magistrate, Supreme Court, Guntur, treatment, Andhra Pradesh, Crime

YSRCP rebel MP Raghurama Krishnam Raju was discharged from Army Hospital, Secunderabad, on Wednesday. Soon after his discharge from the hospital, Raju headed straight to Begumpet airport, Hyderabad. He took a special flight from Begumpet airport and left for Delhi.

అసుపత్రి నుంచి రఘురామకృష్ణరాజు విడుదల.. నేరుగా హస్తినకు..!

Posted: 05/26/2021 02:28 PM IST
Rrr discharged from army hospital leaves for delhi by special flight

సొంత పార్టీపైనే వ్యతిరేక గళం వినిపించిన రెబల్ గా మారిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కండీషనల్ బెయిలు మంజూరు చేయడంతో గత కొన్ని రోజులుగా అసుపత్రిలో చికిత్స పోందుతున్న ఆయన.. ఇవాళ సికింద్రాబాద్ లోని ఆర్మీ అసుపత్రి నుంచి విడుదలయ్యారు. మరో మూడు రోజుల పాటు తనకు చికిత్సన అందించాల్సిందిగా ఆయన కోరినా.. ఆర్మీ అసుపత్రి వర్గాలు ఆయనకు నయం అయ్యిందని డిశ్చార్జ్ చేశాయి. దీంతో ఆయన అసుపత్రి నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయం నుంచి హస్తినకు బయలుదేరి వెళ్లారు.

తనకు ఇంకా అరోగ్యం నయం కాలేదన్న భావనలో వున్న ఆయన నేరుగా ఢిల్లీలోని ఎయిమ్స్ అసుపత్రిలో చేరి చికిత్స తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇక దీంతో పాటు అక్కడ ఆయనకు నయం అయిన తరువాత కేంద్రంలోని పెద్దలను కూడా కలుసుకుని తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని కూడా యోచిస్తున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనపై కక్షగట్టి మరీ తన పుట్టిన రోజునే తనను బలవంతంగా అరెస్టు చేసిందని.. తన భద్రతా అధికారులు అడ్డుకున్నా.. ఏమాత్రం వెనక్కు తగ్గని సిఐడీ అధికారులు తనను అరెస్టు చేసి రాత్రికి రాత్రి గుంటూరుకు తరలించిన విధానాన్ని ఆయన కేంద్రం పెద్దలకు తెలుపనున్నారని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కించపర్చుతూ.. పాలకులకు వ్యతిరేకంగా నిత్యం వ్యాఖ్యలు చేస్తూ, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారన్న అభియోగాలపై రఘురామ కృష్ణరాజుపై ఏపీ సిఐడీ అధికారులు రాజద్రోహం కింద కేసులు నమోదు చేశారు. తనను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పోలీసులు తనపై దాడి చేశారని, దెబ్బలు కానరాకుండా తనను హరికాళ్లు వాయిపోయేలా కోట్టారని రాఘురామరాజు దేశ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. కాగా సీఎం వైఎస్ జగన్ బెయిల్ పై వున్నారని, ఆయన బెయిల్ ను రద్దు చేయాలని వ్యాఖ్యలు చేసిన క్రమంలో రఘురామరాజుపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన కుటుంబసభ్యులు ఇటీవల ఢిల్లీ పెద్దలకు చెప్పిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles