Ramdev gets ₹1,000 cr defamation notice from IMA బాబా రాందేవ్ పై రూ. 1000 కోట్ల పరువునష్టం దావా

Ima uttarakhand sends 1000 crore defamation notice to yoga guru ramdev

defamation notice of ₹1000 crore to Yoga Guru Baba Ramdev, Baba Ramdev Defamation, Baba Ramdev Rs 1000 crore, Baba Ramdev sedition case, Indian Medical Association, IMA Uttarakhand, Yoga Guru Ramdev, defamation notice, allopathy doctors, Uttarakhand, Crime

Following the remarks made by Ramdev regarding allopathy doctors, the Indian Medical Association has sent a defamation notice of ₹1000 crore to Yoga Guru Baba Ramdev. The notice states that if he doesn't post a video countering the statements given by him and tender a written apology within the next 15 days, then a sum of ₹1,000 crore will be demanded from him.

యోగాగురు బాబా రాందేవ్ పై రూ. 1000 కోట్ల పరువునష్టం దావా

Posted: 05/26/2021 03:33 PM IST
Ima uttarakhand sends 1000 crore defamation notice to yoga guru ramdev

యోగాగురు బాబా రాందేవ్ పై ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్(ఐఎంఏ) ఉత్త‌రాఖండ్ శాఖ రూ. వెయ్యి కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేసింది. అల్లోపతి వైద్యవిధానంపై బాబా రాందేవ్ అవాక్కులు చవాక్కులు పేలిన నేపథ్యంలో అలోపతి వైద్యుల ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడంపై ఉత్తరాఖండ్ కు చెందిన ఐఎంఏ డాక్టర్ల సంఘం ఈ మేరకు ఆయనపై పరువు నష్టం నోటీసును పంపించింది. అల్లోపతి వైద్యంపై బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు.. పూర్తిగా తప్పుడు వ్యాఖ్యలని అంగీకరిస్తూ ఓ వీడియో సందేశాన్ని మీడియా ద్వారా యావత్ దేశ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

ఇందుకుగానే కేవలం 15 రోజుల వ్యవధిని ఇస్తూ.. క్షమాపణలు చెప్పని పక్షంలో బాబా రాందేవ్ రూ. 1000కోట్లను ఇవ్వాలని ఐఎంఏ జారీ చేసిన నోటీసులతో పేర్కోంది. కోవిడ్‌ వైరస్ ను తగ్గించేందుకు అల్లోపతి విధానం పనికిరాదని బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలోనూ ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు అనేకం చేసినా.. వాటిపై పెద్దగా విమర్శలు వచ్చినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మాత్రం డాక్టర్ల సంఘం భగ్గుమంది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కూడా లేఖ రాసీన తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్ పై రాజద్రోహం కేసులు నమోదు చేయాలని కూడా కోరింది.

రాందేవ్ బాబాపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి తీర్థ‌సింగ్ రావ‌త్‌కు కూడా ఐఎంఏ ఉత్త‌రాఖండ్ శాఖ లేఖ రాసింది. రాందేవ్ పై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది. దీంతో తన వ్యాఖ్యలపై బాబా రాందేవ్ వెనక్కి తగ్గారు. అల్లోపతి వైద్యంపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. అదే సమయంలో అల్లోపతి డాక్టర్లు సమాధానం చెప్పాలంటూ.. 25 ప్రశ్నలను సంధించారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ వివాదంపై ట్వీట్ ద్వారా చెప్పిన క్షమాపణ సరిపోదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటోంది. అల్లోపతి వైద్యాన్ని, వైద్యులను కించపరిచేలా మాట్లాడిన బాబా రాందేవ్‌ లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles