COVID vaccine: spot registration for 18-44 group టీకా పోందాలంటే ఆన్ లైన్ తోపాటు స్పాట్ రిజిస్ట్రేషన్: కేంద్రం

Covid vaccine on the spot registration for 18 44 group at govt run centres

COVID, COVID vaccine, CoWIN app, health ministry, covaxin, covishield, online registration, spot registration, vaccine registration, COVID-19 News

After vociferous criticism over mandatory appointment via the CoWIN app for COVID vaccinations for those in the 18-to-44 age group, the Centre has now eased the procedure. Today, it said everybody above 18 can now make walk-in registrations, though only at government-run Covid vaccination centres for now.

టీకా పోందాలంటే ఆన్ లైన్ తోపాటు స్పాట్ రిజిస్ట్రేషన్: కేంద్రం

Posted: 05/24/2021 07:21 PM IST
Covid vaccine on the spot registration for 18 44 group at govt run centres

దేశంలో కరోనా వాక్సీన్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం 18 ఏళ్లకు పైబడిన యువతకు కూడా కరోనా టీకాలు ఇస్తూ ఏప్రిల్ నెలలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అసలే దేశంలో కోవిడ్ టీకాల కోరత ఏర్పడిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం.. అందునా అదే సమయంలో దేశంలో రెండో దశ కరోనా ఉద్దృతి కొనసాగడంతో కరోనా టీకాలు హాట్ కేకుల మాదిరిగా రోజుల వ్యవధిలోనే పూర్తి అయిపోయాయి. ఇక వాక్సీన్ల కోసం ఎంతో మంది వస్తున్నా.. లక్షలాది మంది ప్రభుత్వ అసుపత్రుల వద్ద బారులు కట్టినా లాభం లేకుండా పోయింది. ఈ క్రమంలో కోవిన్ యాప్ ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత వాక్సీన్ తీసుకోవాలన్న నిబంధనపై విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం దిగివచ్చింది. మరీ ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన వారు ఇకపై కోవిన్ యావ్ లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పనిలేదని, కోవిడ్ టీకాలు ఇచ్చే కేంద్రాల వద్దకు వచ్చి అక్కడే వాక్సీన్లు తీసుకున్నా సరిపోతుందని కేంద్రప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోవిడ్ టీకాలు ఇకపై స్పాట్ లోనే రిజస్ట్రేషన్ చేసుకునే వెసలుబాటు కల్పించింది. ఇలా వెసలుబాటు ఇవ్వడానికి కూడా కారణం వుంది. అదేంటంటే.. చాలా ప్రాంతాల్లో టీకా డోసులు ముందుగా బుక్ చేసుకుని, తమకు నిర్దేశించిన రోజున వారు రాకపోవడంతో ఆ డోసులు వృథా అయ్యాయి. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని పేర్కోంది.

18 ఏళ్లు నిండిన వారు వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు వెళ్లి డోసులు వేయించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ల వద్దే అప్పటికప్పుడు తమ పేరు, ఇతర వివరాలు నమోదు చేయించుకుని వ్యాక్సిన్ పొందవచ్చని ఓ ప్రకటనలో వివరించింది. అంతర్జాల సదుపాయం లేనివారు, ఫోన్ లేని వారికి కూడా ఈ సదుపాయం వర్తింపచేస్తున్నట్టు వెల్లడించింది. అయితే, ఇది తమ నిర్ణయం మాత్రమేనని, దీన్ని అమలు చేసే విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్వేచ్ఛ ఇచ్చామని కేంద్రం తెలిపింది. ఒకవేళ రాష్ట్రాలు తమ ప్రతిపాదనకు సమ్మతిస్తే... ఈ ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ కేవలం ప్రభుత్వ కొవిడ్ టీకా కేంద్రాల వద్దనే అమలు చేయాలని, ప్రైవేటు టీకా కేంద్రాల వద్ద స్పాట్ రిజిస్ట్రేషన్లు చేపట్టవద్దని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles