AP court sentences 12 highway killers to death హైవే కిల్లర్ మున్నా కేసు.. 12 మందికి ఉరిశిక్ష!

Highway killing ongole court sentences 12 to death including munna

Highway killer, highway killings, highway killer Munna, highway killer Syed Abdul Samad, cleaner, death, driver, highway killer, investigation, killing, munna, munna gang, ongole district court, Munna, syed abdul samad, Ongole court, sensational judgement, prakasham district, Andhra Pradesh, crime

Ongole district court sentenced highway killer Munna and 10 others to death. Munna and his gang were accused of stopping lorries on the highway posing as policemen and killing drivers and cleaners. Four such cases came to light in the year 2008 and 18 persons were found guilty.

హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంగోలు న్యాయస్థానం సంచలన తీర్పు.!

Posted: 05/24/2021 06:29 PM IST
Highway killing ongole court sentences 12 to death including munna

ఒంగోలులో రాత్రి వేళ లారీ డ్రైవర్లు, వాహనాలను నడపాలంటే భయం పుట్టేలా చేసిన హైవే కిల్లర్ మున్నా అలియాస్ సయ్యద్ అబ్దుల్ సమద్ సహా అతని గ్యాంగ్ సభ్యులకు ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మున్నా సహా మొత్తం 12 మందికి న్యాయస్థానం మరణిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. దోషిగా తేలిన గ్యాంగ్ స్టర్ సయ్యద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నాతో పాటు ముఠాలోని మిగతా 11 మందికి కోర్టు మరణదండనను విధించింది. ఇదే కేసులో మరో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. దీంతో ఈ కేసులో మొత్తం 19 మందికి శిక్ష పడింది. ఈ తీర్పు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

జాతీయ రహదారులపై రాత్రి వేళ ప్రయాణించే లారీలను పోలీసుల వేషంతో అపి.. వాహనాలను తనిఖీలు చేస్తున్నట్లు నటించి.. డ్రైవర్లను, క్లీనర్లను కిరాతకంగా చంపి ఆ వాహనాలను, వాటిలో వున్న సరుకులను తక్కువ ధరకు అమ్మి వచ్చిన డబ్బును పంచుకోవడం మున్నా గ్యాంగ్ పని. ప్రకాశంలో జిల్లాలో ఏకంగా 13 ఏళ్ల క్రితం ఏడుగురు లారీ డ్రైవర్లను, క్లీనర్లను హత్య చేసింది. మున్నా 13 హత్య కేసుల్లో నిందితుడు కాగా నాలుగు కేసుల్లో నేరం రుజువైందని ఒంగోలు కోర్టు స్పష్టం చేసింది. లారీ డ్రైవర్లను, క్లీనర్లను దారుణంగా హత్య చేసి గోతాల్లో కుక్కి వాగుల వద్ద పూడ్చిపెట్టిన ఘటన అప్పట్లో పెను సంచలనంగా మారగా ఇప్పటికీ ఎన్నో డ్రైవర్ల మిస్సింగ్ కేసులు మిస్టరీగానే ఉన్నాయి.

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఇస్లామ పేటలో మున్నా నివాసం ఏర్పరుచుకోగా ఇతనికి భార్యతో పాటు ముగ్గురు సంతానం. 2012 అక్టోబర్‌లో ఒంగోలు సబ్ జైలు నుంచి బెయిల్‌ పై విడుదలై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కొంతకాలం జీవనం సాగించాడు. హైదరాబాద్, బెంగుళూరు, వైజాగ్, ఒంగోలులో వ్యాపారాల పేరుతో ప్రజలను భారీ ఎత్తున మోసం చేసి అక్కడి నుంచి మకాం మార్చాడు. పలు కిడ్నాప్ కేసులు.. చోరీ కేసులు కూడా మున్నాపై ఉండగా హైవేలపై లారీలను ఆపి డ్రైవర్లను, క్లీనర్లను అంతమొందించడం ఈ గ్యాంగ్ అసలు వృత్తి. పోలీసుల ఫిర్యాదుతో కర్ణాటకలోని మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్ లో అరెస్టు చేసి ఒంగోలుకు తరలించగా నేడు ఈ కేసులో శిక్ష పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles