216 crore vaccine doses by December: Centre ఆగస్టు-డిసెంబర్ నాటికి అందరికీ వాక్సీన్.. రోడ్ మ్యాప్ రెడీ.!

216 crore vaccine doses to be available between august december centre

COVID vaccine, covid-19, Niti Aayog member V K Paul, covaxin, covishield, AstraZenica, Pfizer, sputnik-V, Niti Aayog member, VK Paul, vaccine doses, covid-19 study, covid-19 antibodies, covid-19 vaccines, Covid 19, Coronavirus, Coronavirus pandemic, Coronavirus update, Coronavirus deaths Coronavirus treament

As states grapple with a shortage of coronavirus vaccines, the Central government said that over two billion doses will be made available in the country in five months between August and December, enough to vaccinate the entire population. It also said Russian anti-Covid vaccine Sputnik V is likely to be available by next week.

ఆగస్టు-డిసెంబర్ నాటికి అందరికీ వాక్సీన్.. రోడ్ మ్యాప్ సిద్దం చేసిన కేంద్రం

Posted: 05/14/2021 10:39 PM IST
216 crore vaccine doses to be available between august december centre

ధేశంలో కరోనా వైరస్ రెండో దశ ఉద్దృతంగా విజృంభిస్తుండటం.. దీని బారిన పడి రోజుకు రమారమి నాలుగు వేల మంది వరకు అసువులు బాస్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వంతో పాటు ఇటు ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. అందరూ కరోనా తమకు రాకుండా ముందస్తుగా టీకాలు వేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఒక్కసారిగా జనం దృష్టి కరోనావాక్సీన్ పై పడటంతో పాటు దేశంలోని 18 ఏళ్లు నిండిన వారకి కూడా టీకా తీసుకునేందుకు అనుమతినిచ్చింది. దీంతో ఒక్కసారిగా వాక్సీన్ కు డిమాండ్ పెరిగింది. అయితే అప్పటికే సప్లై పెద్దగా లేకపోవడంతో అనేక చోట్ల టీకా కొరత ఏర్పడింది.

అటు ఇప్పటికీ ఫ్రంట్ లైన్ వారియర్స్ తో పాటు ఇటు దేశంలోని వయోవృద్దులు అనేక మంది టీకాను తీసుకోలేదు. వీరితో పాటు నడివయస్కు వారు కూడా తొలుత పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ రెండో దశ విరుచుకుపడుతున్న క్రమంలో అందరూ ముందుగా కరోనా టీకాకు ప్రాథాన్యత ఇస్తున్నారు. టీకా తీసుకున్న వారు రెండో డోసు పూర్తైన తరువాత నెల రోజుల పాటు మద్యం ముట్టకూడదని వైద్యులు సూచనలు చేస్తున్న క్రమంలో మందుబాబులు కూడా వాక్సీన్ తీసుకుంటే మూడు నెలల తరువాతైనా మద్యం తాగవచ్చునని, లేకపోతే ప్రాణాలకే ముప్పు పోంచివుందన్న అలోచనలో వాక్సీన్ తీసుకునేందుకు బారులు తీరుతున్నారు.

ఇక అటు యువత మాత్రం వాక్సీన్ తీసుకోవడానికి ఆది నుంచి మొగ్గుచూపుతున్నా ఈ నెల 1 నుంచి మాత్రమే వారికి అనుమతి లభించింది. దీంతో కరోనా టీకాల కొరత ఏర్పడింది. అయితే తాజాగా కేంద్రం ఓ శుభవార్తను చెప్పింది. ఇప్పటికే దేశంలో కొన్ని కోట్ల మంది టీకా తీసుకున్నారని, అయితే ఇంకా అధికశాతం మంది టీకాలు తీసుకోవాల్సి వుందని చెప్పిన ప్రభుత్వం.. వారి కోసం తాజాగా ఓ శుభవార్తను అందించింది. ఈ సంవత్సరం చివరి నాటికి, భారతదేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ రెండు మోతాదులను తీసుకుంటారని, ఈ మేరకు డిసెంబరు నాటికి దేశంలో వ్యాక్సిన్ వేయడానికి సంబంధించి పూర్తి రోడ్ మ్యాప్ ను ప్రభుత్వం సిద్ధం చేసిందని ప్రకటించిది.

ఈ రోడ్ మ్యాప్ ఫ్రకారం జూలై నాటికి దేశంలో మొత్తం 51.6 కోట్ల వాక్సీన్ డోసులు లభ్యం కానుండగా, ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు 216 కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నాయని, ఈ మేరకు ప్రణాళికను రూపోందించామని తెలిపింది. దేశంలో 18 ఏళ్లు పైబడిన 95 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ కంటే అధిక సంఖ్యలోనే టీకాలను ఉత్పత్తి చేసేలా చర్యలు చేపట్టామని తెలిపింది. ఇక ఇంత పెద్దమొత్తంలో ఈ టీకాలను ఉత్పత్తి చేయడానికి ఏ విదేశం సహకారం తీసుకోవడం లేదని చెప్పిన ప్రభుత్వం.. టీకాలన్నీ స్వదేశంలోనే ఉత్పత్తి చేయనున్నారు. దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్లు కాకుండా.. రాబోయే నెలల్లో ఫలితాలు చూపించడం ప్రారంభమవుతుందని చెప్పారు. భారతదేశం 175 మిలియన్లకు పైగా మోతాదులను ఇచ్చిన ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశం అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles