YSRCP MP Raghurama Krishnam Raju arrested by A.P.CID వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్ట్.!

Andhra cid arrest ysrcp rebel mp raghu rama krishna raju sedition slapped

Raghu Rama Krishna Raju, Narsapur MP, member of parliament Narsapur, Hate Speeches, PV Sunil Kumar, Additonal DG CID, Conspiracy, media channels, AP CID, CM YS Jagan, YSRCP, CRPF Security, Andhra pradesh, CRIME

Andhra's ruling YSRCP's rebel MP Raghu Rama Krishna Raju was reportedly arrested by the Crime Investigation Department (CID) of Andhra Pradesh police on Friday afternoon. Around 30 officers from the CID landed up at Raghu Rama Krishna Raju's residence in Hyderabad only to arrest him after serving notice.

హైదరాబాదులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్ట్.!

Posted: 05/14/2021 11:59 PM IST
Andhra cid arrest ysrcp rebel mp raghu rama krishna raju sedition slapped

తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తే తనను ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తారని గతంలో తన అనుమానాన్ని వ్యక్తం చేసిన నర్సాపురం పార్లమెంటు సభ్యుడు ఎంపీ రఘురామకృష్ణరాజును అనుకున్నట్లుగానే అరెస్టు చేశారు. గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న రఘురామరాజును హైదరాబాదులోని ఆయన నివాసంలోనే ఏపీ సిఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆద్యంతం నాటకీయ పరినామాల మధ్య ఆయనను అదుపులోకి తీసుకున్న ఏపి సీఐడీ పోలీసులు ఆయన అక్కడి నుంచి తరలించారు. రఘురామ కృష్ణరాజు  ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ అరెస్టు చేశారు.

తనపై ఏపీ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు ఉపక్రమిస్తుందని అనుమానించిన ఆయన గతంలోనే తనకు రక్షణ కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఆయనకు సీఆర్పీఎఫ్ భద్రతను కేంద్ర కల్పించింది. రఘురామకృష్ణరాజుకు అరెస్టు సందర్భంగా ఆయనకు భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సీఆర్పీఎఫ్ జవాన్లు ఒకరి చేయి ఒకరు పట్టుకుని రఘురామను కవర్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ అధికారులకు, రఘురామకు మధ్య గంటపాటు తీవ్రస్థాయిలో మాటల యుద్దం జరిగింది. అనంతరం ఏపీ సీఐడీ అధికారులు ఆయనను తమ వెంట జీపులో తీసుకెళ్లారు. రఘురామకృష్ణరాజుపై 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghu Rama Krishna Raju  Narsapur MP  AP CID  CM YS Jagan  YSRCP  CRPF Security  Andhra pradesh  CRIME  

Other Articles