Black fungus claimed 52 lives in Maharashtra దేశంలో జడలు విప్పుతున్న బ్లాక్ ఫంగన్..

Black fungus claimed 52 lives in maharashtra 73 cases reported in up

Mucormycosis, black fungus, corona recovering patients, corona recovered patients, high dose steriods, state health department, Maharashtra, Rajesh Tope, Uttar pradesh, Doctors, coronavirus, covid-19, corona vaccine

As many as 52 people have died due to Mucormycosis, a rare but dangerous fungal infection, in Maharashtra since the COVID-19 outbreak last year, a senior health department official said on Friday. Mucormycosis, also known as black fungus, some recovering and recovered coronavirus patients were found infected with the disease, whose symptoms include headache, fever, pain under the eyes, nasal or sinus congestion and partial loss of vision.

దేశంలో జడలు విప్పుతున్న బ్లాక్ ఫంగన్.. మహరాష్ట్రలో 52 మంది బలి..

Posted: 05/14/2021 10:10 PM IST
Black fungus claimed 52 lives in maharashtra 73 cases reported in up

మహారాష్ట్రపై బ్లాక్ ఫంగస్ పంజా విసిరింది. గత ఏడాది కరోనా వైరస్ వెలుగు చూసిన నాటి నుంచి దాని బారినపడి కోలుకుంటున్న రోగులుతో పాటు కోలుకున్న బాధితుల్లో ఏకంగా 52 మంది ప్రాణాలను ఒక్క మహరాష్ట్రలోనే ముకోర్ మైకోసిస్ కబళించి వేసింది. ఈ మేరకు మహారాష్ట్రకు చెందిన సీనియర్ వైద్యఅరోగ్య శాఖ అధికారి వెల్లడించారు. ఇప్పటికీ ఈ బ్లాక్ పంగస్ బారిన పడిన పలువురు చికిత్స పోందుతున్నారని మహారాష్ట్ర అరోగ్యశాఖ మంత్రి రాజేష్ టోప్ తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 1500 కేసులు వున్నాయిని ఆయన తొలిసారిగా ప్రకటించారు.

వీరి చికిత్స కోసం లక్ష యాంఫోటెరిసిన్-బి యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లకు టెండర్లను అహ్వానించామని చెప్పారు. కరోనా రెండో దశ ఉద్దృతంగా కొనసాగుతున్న ఈ తరుణంలో రాష్ట్రంపై బ్లాక్ పంగస్ కేసు మరో బారంగా మారింది. ముకోర్ మైకోసిస్ బారిన పడి రోగుల్లో అనేక మంది మృత్యువాత పడటం కూడా అందోళన కలిగించే అంశమని దీంతో మరణాల శాతాన్ని తగ్గించేందుకు వైద్యులు శాయశక్తులా కృషిచేస్తున్నారని రాజేశ్ టోప్ అన్నారు. మలేరియా, టైఫాండ్ తరహాలో బ్లాక్ పంగస్ అన్నది ఒక గుర్తింపుపోందిన వ్యాది కాదని అందుచేత దీనిని మ్యాపింగ్ చేయలేదని, డేటాబేస్ కూడా రూపోందించలేదని మహారాష్ట్ర అరోగ్యశాఖ అధికారి తెలిపారు.

ఇక అటు ఉత్తర్ ప్రదేశ్ లోనూ బ్లాక్ పంగస్ తన ఉద్దృతిని చాటుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 73 కేసులు బయటపడ్డాయి. వీటిలో అత్యధికంగా వారణాసిలో 20 కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ లో 10 కేసులు బయటపడగా, లక్నోలో 15 కేసులు, ప్రయాగ్ రాజ్ లో 6, గౌతమ్ బుద్ధనగర్ లో 5, మీరట్ లో 4, కాన్పూర్, మధురలో రెండు చొప్పున, ఆగ్రాలో ఒక్క బ్లాక్ పంగన్ కేసు నిర్ధారణ అయ్యాయి. కారణంగా కాన్పూర్ లో ఇద్దరు కరోనా పేషెంట్లు మృతి చెందగా... మధురలో ఇద్దరు, లక్నోలో ఒక పేషెంట్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కారణంగా కంటిచూపును కోల్పోయారు.

ప్రాణాలను హరించే ఈ ఫంగస్ విస్తరిస్తున్న నేపథ్యంలో యూపీలోని యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఫంగస్ వ్యాప్తి చెందుతున్న తొలి దశలోనే దాన్ని ఎదుర్కొనేందుకు 14 మంది వైద్య నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ కమిటీ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడమే కాకుండా... ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది. సుదీర్ఘకాలంగా స్టెరాయిడ్స్ వాడుతున్న వారు, ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉన్నవారు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ నియంత్రించలేని స్థాయిలో ఉన్నవారికి కూడా ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెపుతున్నారు.

ముకోర్ మైకోసిస్(బ్లాక్ ఫంగస్) లక్షణాలు ఇవే: కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నొప్పులు, నెత్తుటి వాంతులు, చురుకుదనంలో మార్పులు చోటుచేసుకోవడం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles