HC Questions 'Irritating' Caller Tune For Vaccination వాక్సీన్ లేకుండా కాలర్ ట్యూన్ తో విసిగించడమేంటీ: ఢిల్లీ హైకోర్టు

No vaccine delhi high court questions irritating caller tune for vaccination

Covid-19 vaccines, COVID shots, covid vaccine message, delhi high court, corona vaccine caller tune, corona telephone message, Justice Vipin Sanghi, Justice Rekha Palli, covid 19 vaccines, corona vaccine irritating caller tune, second Covid Wave, oxygen supply, dissemination of information, covid 19 management, central Government, caller tune, NCT of Delhi

Questioning the caller tune used for awareness of covid Vaccination drive, the Delhi High Court asked the Centre who will get vaccinated where there is not enough vaccines. Stating that there should be some sense of emergency, the Court also asked the Union of India and the GNCTD to ensure steps regarding dissemination of information of covid 19 management.

వాక్సీన్ లేకుండా కాలర్ ట్యూన్ తో విసిగించడమేంటీ: ఢిల్లీ హైకోర్టు

Posted: 05/14/2021 03:23 PM IST
No vaccine delhi high court questions irritating caller tune for vaccination

టెలీకమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను వినియోగించుకుని దేశ ప్రజలను ఎప్పటికప్పుడు పలు కీలక అంశాలపై అటు కేంద్రం ఇటు మొబైల్ సర్వీస్ సంస్థలు అప్రమత్తం చేస్తూనే వున్నాయి. అయితే గత ఏడాది దేశంలో కరోనా విజృంభిస్తుండగానే దేశప్రజలను అప్రమత్తం చేస్తూ కరోనా కాలర్ ట్యూన్ వినిపించింది. ఆ తరువాత కానీ అవతలి వ్యక్తికి ఫోన్ కలిసేది కాదు. ఇక కరోనా కేసులు తగ్గిపోయాయని భావిస్తున్న క్రమంలో వాక్సీన్ కూడా వచ్చేసింది. దీంతో ఇక కరోనా వాక్సీన్ కు సంబంధించిన కాలర్ ట్యూన్ మొబైల్ కాల్ చేయగానే వినిపించడం ప్రారంభించింది.

ఇక తాజాగా కరోనా వాక్సీన్ కొరత ఏర్పడిన నేపథ్యంలోనూ.. ఫోన్ చేయగానే కరోనా కాలర్ ట్యూన్ పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో సరిపడా వ్యాక్సిన్లు లేకున్నా ఫోన్ చేసినప్పుడల్లా విసుగెత్తించేలా కరోనా వాక్సీన్ కాలర్ ట్యూన్ ను ఎందుకు వినిపిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు రాష్ట్రాల్లో వాక్సీన్ అందుబాటులోనే లేకపోయినా.. వాక్సీన్ వేసుకోవాలంటూ కాల్ చేయగానే అదే కాలర్ ట్యూన్ రావడంతో ఉపయోగం ఏమిటని ప్రశ్నించింది. టీకాలు లేకున్నా తప్పకుండా టీకాలు వేసుకోమంటూ ఆ కాలర్ ట్యూన్ ద్వారా చెబుతున్నారని ఇది విని వెళ్లిన వారు టీకాలు అందుబాటు లేవని తెలుసుకుని వెనుదిరుగుతున్నారని పేర్కోంది.

కాలర్ ట్యూన్ మాత్రం టీకా వేసుకోండీ అని చెబుతోంది. వాక్సీన్ అందుబాటులో లేదు.. వెళ్లిన వారికి వాక్సీన్ ఎవరు వేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ రకంగా ప్రజలను నిత్యం విసిగించేలా కరోనా వాక్సీన్ కాలర్ ట్యూన్ ను వినిపించడంలో ఉద్దేశం ఏమిటని నిలదీసింది. ప్రతి ఒక్కరికీ టీకా అందించాలి. చూస్తుంటే ఈ కాలర్ ట్యూన్ ఇంకో పదేళ్లు కొనసాగేలా కనిపిస్తోందని అభిప్రాయపడింది. ఇంకేదైనా కొత్తది వింటే కొంత ఉపయోగకరంగా ఉంటుందని, ఒకవేళ డబ్బులు తీసుకున్నా పరవాలేదు కానీ అందరికీ అయితే టీకా ఇవ్వాలని జస్టిస్ విపిన్ సంఘి, రేఖా పల్లితో కూడిన ధర్మాసనం పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles