War of words between TTD and Kishkinda Trust టీటీడీకి గోవిందానంద సరస్వతి ఘాటు లేఖ

War of words between ttd and kishkinda trust on hanuman birth place

War of words TTD kishkinda Trust, Tirumala Tirupati Devastanam Board Anjanadri, TTD on Hamuman Birth place, Kishkinda Hanumad Janma Bhoomi Tridha Trust, kishkinda trust on Hanuman Birth Place, Govindananda saraswathi Swamy on Hanuman Birth Place, Hanuman Birth Place, kishkinda trust, Govindananda Saraswathi, Anjanadri, TTD, Andhra pradesh, Karnataka

War of words between Tirumala Tirupati Devastanam Board and Kishkinda Hanumad Janma Bhoomi Tridha Trust on Hanuman Birth Place. Govindananda saraswathi Swamy wrote a letter to TTD, stating that he is ready to debate on the issue anytime without delay.

హనుమంతుడి జన్మస్థలంపై చర్చకు ఇప్పుడన్నా రెడీ: గోవిందానంద సరస్వతి

Posted: 05/14/2021 02:59 PM IST
War of words between ttd and kishkinda trust on hanuman birth place

ఆంజనేయుడి జన్మస్థలం టీటీడీ, కిష్కింద ట్రస్టు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు సాగుతున్నాయి. హనుమంతుడు అంజనాద్రిలోనే జన్మించాడని, కిష్కిందలోనే జన్మించాడని ఇరు ట్రస్టుల మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమంటూ గత నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేయడంతో ఈ రెండు ట్రస్టుల మధ్య వివాదం రాజుకుంది. అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ చేసిన ప్రకటను కర్ణాటకలోని కిష్కింద హనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వ్యతిరేకించింది. హనుమంతుడి జన్మస్థం కర్నాటక అని పేర్కోంది.

అంతేకాదు ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రి కానేకాదని, టీటీడీ అసత్యాలను ప్రచారం చేస్తోందని ట్రస్టు వ్యవస్థాపక ధర్మకర్త గోవిందానంద సరస్వతి ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో టీటీడీ ఈ లేఖపై తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు కిష్కింద హనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కు లేఖ రాసింది. హనుమంతుడి జన్మభూమిపై పరిశోధన చేసిన తరువాతే అందుకు సంబంధించిన విషయాన్ని వివరాలతో పాటు ప్రకటించామని తెలిపింది. తాము చేసిన నాలుగు నెలల పరిశోధన తూలనాడుతూ కిష్కంద హనుమద్ జన్మభూమి ట్రస్ట్ తూలనాటం అసమంజమని పేర్కోంది. ఈ పరిశోధనలోనే హనుమంతుడి జన్మస్థలంగా గుర్తించామని, ఈ విషయంలో అవసరమైతే చర్చకు రావాలని సవాలు విసిరింది.

దీంతో ఈ రెండు ట్రస్టుల మధ్య వివాదం మరింత ముదిరింది. దీంతో టీటీడీ లేఖపై తాజాగా గోవిందానంద సరస్వతి లేఖ రాశారు. తాను చర్చకు సిద్దమని, అయితే అందుకోసం పది, 20 రోజులు ఎందుకని ప్రశ్నించిన ఆయన ఇప్పటికిప్పుడైనా తాము చర్చకు సిద్ధమేనని ప్రతి సవాల్ విసిరారు. నాలుగు నెలలపాటు చేసిన పరిశోధనపై మీకే నమ్మకం లేనట్టుందని.. అందుకనే 20 రోజుల తరువాత చర్చకు సిద్దమని చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఉత్తరప్రత్తుత్తరాలతో సమయాన్ని వృథా చేయకుండా.. టీటీడీకి తమ విలువలపై నమ్మకం ఉంటే చర్చ సభ తేదీని ప్రకటించాలని కోరారు. తేదీని నిర్ణయించి తరువాత తమకు తెలిపిదే సరిపోతుందని గోవిందానంద ఆ లేఖలో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles