Oxygen leak at Vijayawada Railway Hospital in AP విజయవాడ రైల్వే అసుపత్రిలో ఆక్సిజన్ లీక్..

Thousand kilo litres of oxygen leak at vijayawada railway hospital in andhra pradesh

Thousand kilo litres Oxygen in air, Oxygen leaked in vijayawada railway hospital, oxygen nab reversed, Vijayawada Railway Hospital, oxygen refilling centre, Andhra Pradesh, crime

Thousand kilo litres of Oxygen leaked due to the nab fault at Vijayawada Railway Hospital oxygen refilling centre in Andhra Pradesh. Locals ranout from the incident place as oxygen leaks.

విజయవాడ రైల్వే అసుపత్రిలో ఆక్సిజన్ లీక్.. వేల కిలోలీటర్లు గాలిలోకి..

Posted: 05/13/2021 12:09 PM IST
Thousand kilo litres of oxygen leak at vijayawada railway hospital in andhra pradesh

కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో విపరీతంగా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో పలు దేశాలు సాయాన్ని అందించి ఆక్సిజన్ ను అందించగా, వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడంలోనూ నిర్లక్ష్యం వెన్నాడుతోంది. కరోనా బారిన పడిన రోగులకు ఊపిరి తీసుకోవడంలో ఏర్పడిన ఇబ్బందిని కేవలం ఆక్సిజన్ ఉపశమనం కల్పించి.. వారికి తిరిగి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఊపిరి తీసుకోవడంలో ఉపశమనం కల్పిస్తున్న ఆక్సిజన్ లీక్ అవుతున్న కేసులు దేశంలో చోటుచేసుకుంటున్నాయి. కరోనా బాధితులు ప్రాణాలను నిలిపి ప్రాణవాయువు వేల కిలో లీటర్ల మేర గాలిలో కలుస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

లీటర్ల మేర ప్రాణవాయువుతో ప్రాణాలు నిలుస్తున్నాప్పడు వేల కిలో లీటర్ల ఆక్సిజన్ గాలితో కలుస్తున్న నేపథ్యంలో వేలాది మంది ప్రాణాలను కూడా కాపాడుకునే పరిస్థితిని ఈ నిర్లక్ష్యం తీస్తుందన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. తాజాగా విజయవాడ రైల్వే ఆసుపత్రిలో వెయ్యి కిలోలీటర్లకు పైగా ఆక్సిజన్ వృథా అయింది. ఆక్సిజన్ ను రీఫిల్లింగ్ చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఏం జరిగిందో తెలుసుకున్న రోగులు బంధువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అయితే ఇక్కడ ఎలాంటి ఘటన సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. విజయవాడ రైల్వే ఆసుపత్రికి ప్రతి రోజూ ఆటోనగర్లో ఉన్న ఫణి గ్రీష్మ ఏజెన్సీ నుంచి వెయ్యి కిలోలీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది. అలాగే క్రితం రోజున ఓ ట్యాంకర్ ఆక్సిజన్ మోసుకొచ్చింది. ట్యాంకర్ లోని ఆక్సిజన్ ను ఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లీకైంది. దీంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం తెల్లని పొగలా ఆక్సిజన్ దట్టంగా కమ్మేసింది. దాదాపుగా వంద కిలో లీటర్లకు పైగానే ప్రాణవాయువు గాలిలో వెళ్లింది. ఆక్సిజన్ లీకైనప్పటికీ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు, కాన్సంట్రేటర్లు ఉండడంతో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఘటనపై డివిజనల్ రైల్వే మేనేజర్ విచారణకు ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oxygen leak  railway hospital  thousand kilo liters  vijayawada  Andhra Pradesh  crime  

Other Articles