TDP releases list of dead-persons in Ruia hospital రుయా ఘటనపై సిట్టింగ్ జడ్జి విచారణకు నిమ్మల డిమాండ్

Ruia deaths not 11 more than 31 alleges tdp mla nimmala ramanaidu

Oxygen leakage in Ruia, Oxygen leakage deaths in Ruia Hospital, MLA discloses list of 31 deaths in Ruia, Govt declares 11 deaths in Ruia, Oxygen, probe, sitting Judge, TDP MLA, Nimmala RamaNaidu, Tirupati, Andhra Pradesh, Politics

Demanding a probe with sitting judge TDP alleges the deaths in Ruia Hospital Oxygen incident are more than 11. Today Telugu Desam party MLA Nimmala Ramanaidu releases all the dead persons list of 31 members in Ruia hospital and says the number may increase as they are inquring few more people.

రుయా ఘటనపై సిట్టింగ్ జడ్జి విచారణకు నిమ్మల డిమాండ్.. మృతుల జాబితా ఇదే..

Posted: 05/13/2021 01:05 PM IST
Ruia deaths not 11 more than 31 alleges tdp mla nimmala ramanaidu

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన వారి సంఖ్య వివరాలను తేల్చేందుకు, ఘటనపై సమగ్ర విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరపించాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఇటీవల అక్సిజన్ అందక మరణించిన వారి సంఖ్యలోనూ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతుందని అరోపించింది. ఈ ఘటనలో కేవలం 11 మంది మాత్రమే చనిపోయారని చెబుతున్న ప్రభుత్వం.. మరికొందరి మరణాలను దాచిపెడుతోందని తప్పుదారి పట్టిస్తోందని పేర్కోంది. తమ ప్రభుత్వానికి చెడు పేరు రాకూడదని మరణాలను కూడా దాచిపెట్టి రాజకీయం చేస్తోందని విమర్శించింది.

అయితే రుయా అసుపత్రిలో మరణించిన వాస్తవ మృతుల సంఖ్య 31 మందని టీడీపీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెబుతున్న 31 మంది మాత్రమే కాక మరో 10 నుంచి 15 మంది వరకు చనిపోయి ఉంటారని, వారి వివరాలు కూడా సేకరిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారి పేర్లు, వయసు, చిరునామా తదితర వివరాలను మీడియాకు వెల్లడించారు.

రుయా మృతుల విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆసుపత్రిలో కేవలం ఐదు నిమిషాల పాటు మాత్రమే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందని కొందరంటే, మరికొందరు 35 నిమిషాలు, 40 నిమిషాలు అంటున్నారని అన్నారు. ఈ విషయంలో నిజనిర్థారణ కావాలంటే సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించడమే మేలని ఆయన డిమాండ్ చేశారు. యాభై మందికి పైగా ప్రాణాలను కోల్పియన ఘటనలో కేవలం 11 మంది మాత్రమే మరణించారని ప్రభుత్వం తప్పుడు లేక్కలను ఎలా విడుదల చేస్తోందని ఆయన ప్రశ్నించారు. శవాల మీద కూడా రాజకీయం చేస్తున్న పాలకపక్షం దమ్ముధైర్యం వుంటే న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

రుయా ప్రభుత్వంలో జరిగిన మరణాలన్నింటీని ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని అన్నారు. సీఎం తప్పిదం వల్ల చనిపోతున్న ప్రతి బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని రామానాయుడు డిమాండ్ చేశారు. ఘటన జరిగిన రోజు ఉదయం రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ అంతా సక్రమంగా ఉందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని.. ఆతర్వాత గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకుని 50 మంది వరకూ చనిపోవడం వెనుక కారణాలను వెలికి తీయాలంటే విచారణ జరపించాల్సిందేనని అన్నారు. పదిరోజులుగా ఆక్సిజన్ సరఫరాలో అంతరాయాలున్నట్లు మృతుల బంధువులు చెబుతున్నారని, ప్రాణాలు పోయేంత వరకు ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించిన ఆయన.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆస్పత్రికి ఎందుకు వెళ్లలేదని, బాధితులకు ఎందుకు భరోసా కల్పించలేదని నిలదీశారు.

రామానాయుడు వెల్లడించిన జాబితా ఇదే:

1.డి షాహిత్(27), వరదయ్యపాలె, చిత్తూరు
2. షేక్ మహమ్మద్ బాషా(49), గోవింద్ నగర్, తిరుపతి
3. జయచంద్ర, 5/18 సుందరయ్యనగర్, తిరుపతి
4. కే బాబు(55), వాసవి సాయి టవర్స్, తిరుపతి
5. ఆదిలక్ష్మి(48), శ్రీకాళహస్తి
6. సీ. తనూజా రాణి(48) కేఎల్ఎం ఆస్పత్రి, గాజులమండ్యం
7. పీ గౌస్ బాషా(37), కొత్తపేట, పుంగనూరు
8. ఎస్ ఫాజుల్లా(41), కలికిరి
9. బీఎస్ మునీర్ సాహెబ్(49), డోర్ నెంబర్ 7-14, బస్టాండ్ వీధి, మర్రిపాడు, గుర్రంకొండ
10. పీ సుధాకర్(36), చౌడేశ్వర్ నగర్, మదనపల్లె
11. బీ గజేంద్రబాబు(36), కురవపల్లి, పుంగనూరు
12. బీ సులోచన(52), కలకడ
13. వై వేణుగోపాల్(55), మదనపల్లె
14. రమణాచారి(40), పీలేరు
15. ఎస్కే కలదర్(48), కుక్కలదొడ్డి, రైల్వేకోడూరు మండలం, కడప
16. ఎం పార్వతమ్మ(60), బొమ్మయ్యగారిపల్లి, రొంపిచర్ల
17. నారాయణ తాళ్లూరు(55), ఎస్ఎన్ కాలనీ, రాయచోటి, కడప
18. సుబ్బయ్య(67), హెచ్.చెర్లోపల్లి, రాజంపేట
19. ఆవుల వెంకటసుబ్బయ్య(29), హెచ్.చెర్లోపల్లి, రాజంపేట
20. బీ. దేవేందర్ రెడ్డి(60), ఆదినవరపల్లి, యర్రావారిపాలెం, చిత్తూరు
21. జీ భువనేశ్వర్ బాబు(36), తేజనగర్, చిత్తూరు
22. ఎన్ ప్రభాకర్, 22-13-394-13 తిరుమలనగర్, శెట్టిపల్లి మంగళం, చిత్తూరు
23. పీఎస్ రామారావు, తొండవాడ, చిత్తూరు
24. సీ మదన్మోహన్ రెడ్డి(52), చిత్తూరు
25. ఎన్ శివప్రియ(33), చిత్తూరు
26. ఎన్ మోహన్ దాస్, 12/3/6, నగరి
27. కే దుర్వాసులు(34), పాకాల
28. ఎం రాజమ్మ, వల్గమూడి నెల్లూరు
29. టీ రమేష్ బాబు(39), తిరుపతి
30. జీ వాణి, రాజీవ్ గాంధీ కాలనీ, తిరుపతి
31. కే సరోజమ్మ, తారకరామనగర్, కరకంబాడి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles