House Arrest a form of judicial custody: SC ఇకపై ఆ శిక్ష కూడా జ్యుడిషియల్ కస్టడీనే: సుప్రీంకోర్టు

House arrest can be used as a form of judicial custody supreme court says

house arrest, judicial custody, overcrowding in prisons, peoples money, Justice UU Lalit, Justice KM Joesph, Supreme Court, Varavara Rao, Arun Ferreira, Vernon Gonsalves, Sudha Bhardwaj, Gautam Navlakha, Bombay High Court, bail plea, Crime

An accused can be placed under house arrest in the name of judicial custody, the Supreme Court said today, citing overcrowding in prisons and the cost of maintaining them with taxpayers' money.

ఇకపై ఆ శిక్ష కూడా జ్యుడిషియల్ కస్టడీనే: సుప్రీంకోర్టు

Posted: 05/12/2021 11:14 PM IST
House arrest can be used as a form of judicial custody supreme court says

పలు కేసుల్లో నేరారోపణలు ఎదుర్కోంటున్న నిందితులను న్యాయస్థానాలు జ్యుడీషియల్ కస్టడీ పేరిట రిమాండ్ విధించడం అందులో భాగంగా వారిని జైలుకి పంపే విషయం తెలిసిందే. అయితే, దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశంలోని జైళ్లన్నీ నిందితులు, దోషులతో నిండిపోతున్న నేపథ్యంలో ఇకపై నిందితులను జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా హౌస్ అరెస్ట్ చేయొచ్చని తెలిపింది. ఇక దేశంలోని జైళ్లన్ని పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నిర్వహిస్తున్నారని, రానురాను జైళ్ల నిర్వహణకు ప్రజాధనం అధికంగా వినియోగం అవుతుందని పేర్కొంది.

ప్రతి సంవత్సరం జైళ్ల నిర్వహణకు రూ. 6,818.1 కోట్ల బడ్జెట్ ను ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని హౌస్ అరెస్ట్ లు చేయాలని సూచిస్తున్నామని  జస్టిస్ లలిత్, జస్టిస్ జోసెఫ్ లతో కూడిన ఇద్దరు సభ్యుల అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం తెలిపింది. అయితే నిందితులను హౌస్ అరెస్ట్ చేయడానికి వారి వయసు, ఆరోగ్యం, వారు చేసిన నేర తీవ్రత తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. అయితే, విచారణల తర్వాత ఏం చేయాలనే విషయాన్ని న్యాయ వ్యవస్థకు వదిలేయాలని చెప్పింది.

జైళ్లు కిక్కిరిసి పోతున్నాయని, ప్రభుత్వాలకు ఖర్చు ఎక్కువవుతోందని... అందుకే ఈ సూచన చేశామని తెలిపింది. అయితే న్యాయనిపుణులు మాత్రం గృహనిర్భంధాన్ని జుడీషియల్ కస్టడీగా పరిగణించడం లేదు. భీమా కోరెగావ్ కేసులో అరెస్టైన ఐదుగురిలో గౌతమ్ నవ్లఖ తనకు బెయిలు మంజూరు చేయాలని బొంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రింకోర్టును ఆశ్రయించగా ఇవాళ అక్కడి తిరస్కారం ఎదురైంది. అయితే తాను జుడిషియల్ కస్టడీలో భాగంగా గృహనిర్భంధంలో వున్న కాలాన్ని పరిగణించాలని ఆయన చేసిన విన్నపాన్ని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో విప్లవ కవి, విరసం నేత వరవరరావు కూడా అరెస్టై.. బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles