How long do coronavirus antibodies last? కరోనా నుంచి కోలుకున్నవారికి గుడ్ న్యూస్

Antibodies in those who have recovered from corona protects upto 8 months

covid-19, covid-19 study, covid-19 antibodies, covid-19 vaccines, Covid 19, Coronavirus India, Coronavirus pandemic, Coronavirus update, Coronavirus deaths in India, Coronavirus cases in India, New coronavirus cases in India, Coronavirus treament

According to Italian researchers, coronavirus antibodies remain in recovered patients for at least eight months after first testing positive. These antibodies are found in patients regardless of how severe their reaction was to the virus, and their age, said Milan's San Raffaele hospital.

కరొనా నుంచి కోలుకున్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన తాజా అధ్యయనం..

Posted: 05/12/2021 10:52 PM IST
Antibodies in those who have recovered from corona protects upto 8 months

క‌రోనా మహమ్మారి రెండో దశ మరింత వేగంగా దేశంలో మృత్యుఘంటికలను మ్రోగిస్తున్న తరుణంలో తాజాగా చేసిన ఓ అధ్యయనం కరోనా బారిన పడి కొలుకున్న వ్యక్తులకు మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా సోకి కోలుకున్న వారిలో యాంటీబాడీలు (ప్ర‌తిర‌క్ష‌కాలు) ఉంటాయ‌ని అవి మ‌రోసారి క‌రోనా బారిన ప‌డ‌కుండా కాపాడ‌తాయన్న విషయం తెలిసిందే. అయితే, క‌రోనా నుంచి కోలుకున్న అనంత‌రం అవి ఎంత కాలం ఉంటాయ‌న్న విష‌యంపై అధ్యయనాలు కొన‌సాగుతున్నాయి. తాజాగా అధ్యయనాల ఫలితాల వివరాలను వెలుగులోకి వచ్చాయి.

కరోనా సోకిన వారు వాక్సీన్ తీసుకుంటే వారిలో యాంటీ బాడీలు కేవలం పది రోజుల వ్యవధిలోనే పెంపొందించబడుతాయని, అవి ఏకంగా సంవత్సర కాలం పాటు కరోనా సోకకుండా రక్షణ కల్పిస్తాయని ఓ అధ్యయనం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇదే క్రమంలో కరోనా బారిన పడి కోలుకున్న వ్యక్తులలో స్వతహాగా కూడా ప్రతిరక్షకాలు ఉత్పత్తి చెందుతాయని అవి క‌నీసం ఎనిమిది నెలల పాటు ఉంటాయ‌ని ఇటలీ శాస్త్రవేత్తలు తాజాగా పేర్కొన్నారు. అంతేకాదు, ఇన్ ఫెక్షన్‌ తీవ్రతతో పాటు క‌రోనా సోకిన వారి వయసు, వారికి ఉండే ఇత‌ర‌ అనారోగ్య సమస్యలు వంటి అంశాలతో సంబంధం లేకుండా యాంటీబాడీలు ఉంటాయ‌ని చెప్పారు. 

ఇందుకోసం 162 మంది కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులపై పరిశోధన జ‌రిపిన ఇట‌లీ శాస్త్ర‌వేత్త‌లు అధ్యయనం వివరాలలో ఈ విష‌యాన్ని తెలిపారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్‌లో క‌రోనా నుంచి కోలుకున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి ఈ అధ్య‌యనం చేశారు. అనంత‌రం నవంబరు నెలాఖ‌రులో మరోసారి న‌మూనాలు తీసుకున్నారు. ఆయా వ్యక్తులలో యాంటీబాడీలు మెల్లిగా తగ్గుతాయ‌ని, అయిన‌ప్ప‌టికీ క‌రోనా సోకిన ఎనిమిది నెలల తర్వాత కూడా శ‌రీరంలో వాటి ఉనికి ఉందని చెప్పారు. తాము ప‌రిశోధ‌న‌లు చేసిన వారిలో ఎనిమిది నెలల తర్వాత ముగ్గురిలో మాత్రమే యాంటీబాడీలు లేవని వివ‌రించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Antibodies  corona recovered patients  8 months  study  coronavirus  covid-19  corona second wave  

Other Articles