Doctor vaccinating patients in car in Andhra pradesh అధిక ధరకు టీకా అమ్మకం.. ఏపీలో ఓ వైద్యుని నిర్వాకం

Doctor vaccinating patients in car in vijayawada of andhra pradesh

Doctor encashing vaccine, Vijayawada corporator chases doctor, corporator complaints on doctor, Sharwani Murthy, doctor vaccinating patients in car, covid, coronavirus, covid-19 corona vaccine, Doctor, corporator, Sharvani murthy, giri veedhi, satyanarayanapuram, vijayawada, g konduru, Andhra Pradesh, crime

A Doctor from Andhra Pradesh Doctor vaccinates patients in car and cashing higher amount in giri veedhi of satyanarayanam puram from Vijayawada of Andhra pradesh.

అధిక ధరకు కరోనా వాక్సీన్ అమ్మకం.. ఏపీలో ఓ వైద్యుని నిర్వాకం

Posted: 05/12/2021 10:26 PM IST
Doctor vaccinating patients in car in vijayawada of andhra pradesh

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచంవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగోంటున్న తరుణంలో ప్రజల్లో వాక్సీన్ వేసుకుని రక్షణ పోందాలన్న ఆకాంక్ష అధికమైంది. అయితే ఇదే అదనుగా భావించిన వైద్యుడు తన కారునే మొబైల్ వాక్సీనేషన్ కేంద్రంగా మార్చి మరీ డబ్బు చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం స్థానిక కార్పోరేటర్ దృష్టికి వెళ్లడంతో ఆయన వైద్యుడితో పాటు కారులో వున్న మరో ముగ్గురు వ్యక్తులను చేజ్ చేసి మరీ పోలీసులకు అప్పగించారు. అయితే అధిక ధరకు వాక్సీన్ వేయిస్తున్నాడన్న అరోపణలపై అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వద్ద ఎలాంటి వాక్సీన్ లభించకపోవడంతో వదిలిపెట్టారు.

కొవిడ్ టీకాల కొరతను అడ్డగోలుగా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించిన వైద్యుడితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురు పోలీసులకు చిక్కిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు స్థానికులు, పోలీసుల కథనం మేరకు ఇలావున్నాయి.. విజయవాడ నగరంలోని సత్యనారాయణపురంలో గల గిరి వీధిలో ఓ వైద్యుడు కరోనా వాక్సీన్ వేస్తానని చెప్పాడు. ఒక్కో వ్యక్తి నుంచి డోసుకు రూ. 600 వసూలు చేస్తూ కారునే మొబైల్ వాక్సీనేషన్ కేంద్రంగా మార్చేవేసి.. టీకాలు వేస్తున్నాడు. దీంతో కొందరు విషయాన్ని స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తికి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఆయన వైద్యుడిని నిలదీయడంతో పలాయనం చిత్తగించాడు.

అప్రమత్తమైన కార్పొరేటర్ స్థానికుడి బైక్ పై కారును వెంబడించారు. రామవరప్పాడు రింగ్ సెంటర్ లో కారును ఆపి వైద్యుడిని పట్టుకున్నారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు కారును తనిఖీ చేశారు. అందులో టీకా వేయించుకున్న ముగ్గురు భీమవరం వ్యక్తులు కనిపించారు. అలాగే కొన్ని సూదులు, ఇంజక్షన్లు లభించాయి. కారులోని వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి వివరాలు సేకరించారు. అయితే తాము జీ కోండురుకు చెందిన వారమని వారు పోలీసులకు చెప్పారు. అయితే కారులో వ్యాక్సిన్లు కనిపించకపోవడం, పోలీసులు సదరు వైద్యుడితో పాటు అతడి కారులో వున్న ముగ్గురి కూడా వదిలిపెట్టేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles