Hyderabad old city witnesses minimal covid-19 పాతబస్తీలో కరోనా రెండో దశకు సుస్తి

The spread of covid 19 in hyderabad old city area is minimal

coronavirus in Hyderabad old city, minimal corona positive Hyderabad Old City, corona spread old city, minimal covid positive old city, novel virus, Hyderabad, Coronavirus, covid-19, Corona second wave, Coronavaccine, Covaxin, Telangana, Crime

While the whole country is suffering from the rapid spread of coronavirus, Hyderabad's Old City is not that affected by this novel virus. The fact that the number of corona positives in the local pH seal is less than 10 per cent has come as a surprise to both the public and doctors.

పాతబస్తీలో కరోనా రెండో దశకు సుస్తి.. ప్రభావం అంతంతమాత్రమే.!

Posted: 05/12/2021 10:06 PM IST
The spread of covid 19 in hyderabad old city area is minimal

కరోనా వైరస్ మహమ్మారి తొలి ధశ నేపథ్యంలో విపరీతమైన కేసులతో అల్లాడిపోయిన పాతబస్తీలో.. అంతకుమించిన వేగంతో, ఉద్దృతితో పలు రెట్లు అధిక స్థాయి ప్రభావం చూపుతున్న రెండో దశ మాత్రం పాతబస్తీలో ప్రభావం చాటలేకపోతోంది. పాతబస్తీలో కరోనా రెండో దశకు సుస్తి చేసిందనే చమత్కారాలు కూడా వినిపిస్తున్నాయి. ఔను.. నిజమేనండీ.. రంజాన్ నేపథ్యంలో పాతబస్తీలో అధికంగా వుండే ముస్లింలు ఉపవాస దీక్షలు (రోజా) చేస్తుండటంతో వారి దరికి కూడా కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ వెళ్లడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కరోనాకు లంకణం పరమ ఔషదమని ఇప్పటికే ఆయుర్వేద వైద్యులు చెబుతుండటం.. దానికి ఈ వార్తలు బలాన్ని చేకూర్చుతున్నాయి.

దేశం యావత్తు రెండో దశ వైరస్ తో అల్లాడిపోతున్నా.. హైదరాబాద్ పాతబస్తీలో మాత్రం వైరస్ వ్యాప్తి నామమాత్రంగానే ఉండడం వైద్య నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడి పీహెచ్‌సీలలో పాజిటివ్ రేటు పది శాతం లోపే నమోదు కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా పాతబస్తీలో ప్రాథ్యమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో కేవలం ఐదు శాతం పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పాతబస్తీలోని 18 ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేస్తున్నారు. దారుల్ షిపా ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 10న 50 మందికి పరీక్షలు చేస్తే వారిలో ఒక్కరు మాత్రమే పాజిటివ్‌గా తేలారు. వైరస్‌ను కచ్చితంగా పట్టుకోగలిగే ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లోనూ పాజిటివ్ రేటు అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.

ఇక అజాంపుర, యాకుత్ పుర ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న పరీక్షల్లో 99 శాతం మంది నెగటివ్‌ వస్తుండగా, కేవలం ఒక్క శాతం మాత్రమే పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. మరీ ముఖ్యంగా యాకుత్‌పుర-2 పీహెచ్‌సీ పరిధిలో పాజిటివ్ రేటు సున్నాగా నమోదు కావడం నమ్మలేని నిజంగా మారింది. ఈ పీహెచ్‌సీ పరిధిలో ఇప్పటి వరకు 471 మందికి పరీక్షలు చేస్తే ఒక్కరు కూడా కొవిడ్ బారినపడినట్టు నిర్ధారణ కాలేదు. దీంతో అసలు పాతబస్తీలో పరిస్థితులు యావత్ దేశానికి బిన్నంగా ఎందుకు మారాయని వైద్య అరోగ్యశాఖ అధికారులు విస్మయానికి గురువతున్నారు. జనసాంధ్రత అధికంగా వుండే పాతబస్తీలో కరోనా కేసులు నామమాత్రంగా నమోదు కావడం ఆశ్చర్యకంగా వుంది.

అయితే వలసలు తక్కువగా ఉన్నాయన్నది ఒక కారణం కాగా, ఇక్కడ అధికంగా వుండే ముస్లింలు ఉపావాసదీక్షలలో కొనసాగడం మరో ముఖ్యకారణంగానూ వినిపిస్తోంది. ఇక దీనికి తోడు సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన హలీం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఇక్కడ పాజిటివిటీ రేటు తక్కువగా ఉండడానికి బహుశా అదే కారణమై ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే, ఈ ప్రాంతాల్లో డ్రైఫ్రూట్స్ వినియోగం కూడా ఎక్కువని, ఇవి రోగ నిరోధకశక్తిని పెంచడంతో ఇక్కడి ప్రజలపై కరోనా సెకెండ్ వేవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోతుందని వైద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles