Sixth-grade girl shoots three at Idaho middle school తరగతి గదిలో కాల్పులు జరపిన 6వ తరగతి విద్యార్థిని

Sixth grade girl injures three people after opening fire with handgun

Sixth class girl, Gun Culture, US Gun Culture, sixth-grade girl, gun shot, two students injured, Idaho middle school, teacher, Idaho Falls, Anderson, America, United States, Crime

A sixth-grade girl shot two students and a custodian at an Idaho middle school before being disarmed by a teacher, authorities said. The girl lived in nearby Idaho Falls and has been taken into custody, Anderson said. Authorities did not release her name, and it is unclear what motivated the attack.

సహచర విద్యార్థులపై కాల్పులు జరపిన ఆరవ తరగతి విద్యార్థిని

Posted: 05/07/2021 11:29 PM IST
Sixth grade girl injures three people after opening fire with handgun

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి నానాటికీ పేట్రేగిపోతున్నది. గన్ కల్చర్ తో అభంశుభం తెలియని అమాయక విద్యార్థులు కూడా ఉపాధ్యాయులను, తోటి విద్యార్థులపై తూటాలతో దాడి చేసి వారి ప్రాణాలు క్షణికావేశంలో తీసేశారు. ఇక మరికోందరిని గాయాలపాలు చేశారు. చిన్నారుల నుంచి మొదలుకుని పెద్దల వరకు అందరూ క్షణికావేశంలో ఆయుధాలను తీసుకువచ్చి కాల్పులు జరపడమే పరిష్కారంగా ఎంచుకుంటున్నారు. అగ్రరాజ్యంలో తుపాకీ సంస్కృతిని నియంత్రించాలని పాలకులు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటివరకు ఇంకా అచరణలో మాత్రం సాధ్యంకాలేదు. ఇలా ఈ సంస్కృతి నియంత్రణలో జరుగుతున్న కాలయాపన.. అగ్రరాజ్యవాసుల అసువులు తీస్తోంది.

తాజాగా అగ్రరాజ్యంలోని మరోమారు తరగతి గదిలో కాల్పుల మోత మ్రోగింది. ఆరో త‌ర‌గ‌తి విద్యార్థిని తాను చ‌దువుతోన్న‌ పాఠ‌శాల‌లో తుపాకీతో కాల్పులు జ‌రిపి అల‌జ‌డి రేపింది. అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.  ఎల్లో స్టోన్ జాతీయ పార్కుకు 95 మైళ్ల దూరంలోని ఇదాహో రాష్ట్రంలోని రిగ్బి అనే చిన్ననగరంలోని రిగ్బి మిడిల్ స్కూల్ లో ఆరో తరగతి చదువుతున్న ఓ బాలిక‌ బడికి వ‌చ్చే స‌మ‌యంలోనే ఓ తుపాకీని త‌న వెంట తెచ్చుకుంది. పాఠ‌శాల‌లో విచక్షణ రహితంగా కాల్పులకు తెగ‌బ‌డ‌డంతో ఇద్దరు విద్యార్థులు, స్కూల్ సిబ్బందికి ఒకరికి గాయాల‌య్యాయి.

దీంతో  వారిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించిన సిబ్బంది చికిత్స అందేలా చేయ‌డంతో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. వారు ముగ్గురూ కోలుకుంటున్నార‌ని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న‌ పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. కాల్పులు జ‌రిపిన బాలిక‌ను అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో తుపాకీ సంస్కృతి కార‌ణంగా త‌రుచూ కాల్పుల ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు పాఠ‌శాల‌లో చ‌దివే బాలిక‌ కూడా తుపాకీతో కాల్పులు జ‌ర‌ప‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sixth class girl  Gun Culture  gun shot  Idaho middle school  America  United States  Crime  

Other Articles