అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ కరోనాతో మృతి చెందారనే విషయం మీడియాలో ప్రముఖంగా ప్రసారమైన సంగతి తెలిసిందే. చోటా రాజన్ ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారని ఎయిమ్స్ వైద్యులు తెలిపినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఇటు ఎయిమ్స్ వైద్యులతో పాటు అటు ఢిల్లీ పోలీసులు ఖండించారు. భారత మోస్ట్ వాంటెండ్ జాబితాలో వుండి ఇండోనేషియాలోని బాలిలో అక్కడి పోలీసులకు చిక్కిన చోటా రాజన్ చనిపోలేదని వారు వెల్లడించారు. చోటా రాజన్ కరోనా కాటుతో అసువులు బాసారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఎయిమ్స్ వైద్యవర్గాలు వార్తను ఖండించాయి.
2015లో ఇండొనేషియాలోని బాలీలో పోలీసు అధికారులకు చిక్కిన చోటా రాజన్ ను అప్పటి నుంచి కట్టుదిట్టమైన భద్రత కలిగిన తీహార్ జైల్లో ఉంచారు. అయితే ఆయన ఈ సోమవారం కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకావాల్సి వుండింది. అయితే చోటా రాజన్ ను న్యాయస్థాన వీడియో కాన్పరెన్స్ ఎదుట హాజరుపర్చలేకపోతున్నామని తీహార్ జైలు అధికారులు న్యాయస్థానానికి టెలిఫోన్ ద్వారా సమాచారం అందించారు. అందుకు కారణం ఆయనకు కరోనా సోకిందని, పరీక్షల్లో ఆయన కరోనా పాజిటివ్ అని కూడా నిర్థారణ అయ్యిందని జైలు అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో చోటా రాజన్ ను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం అకస్మాత్తుగా ఆయన కరోనా కాటుకు బలయ్యారని వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ వార్తలను అటు జాతీయ మీడియా సహా స్థానిక మీడియా కూడా ప్రముఖంగా ప్రచురించడంతో అటు ఎయిమ్స్ అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా స్పందించారు. చోటా రాజన్ కరోనాతో మరణించలేదని, ఆయనకు చికిత్స అందిస్తున్నామని వైద్యవర్గాలు తెలిపాయి. కాగా చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర నికల్జీ. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న రాజన్.. సుమారు 70 క్రిమనల్ కేసులను ఎదర్కోంటున్నాడు. కాగా 2011లో జర్నలిస్టు జ్యోతిర్మయి దేవ్ హత్య కేసులో న్యాయస్థానం 2018లో ఆయనకు జీవితఖైదు శిక్షను విధించింది. దీంతో పాటు అనేక హత్య కేసులతో పాటు బెదిరింపులకు గురిచేసి డబ్బును లాగే కేసుల్లోనూ చోటా రాజన్ దోషిగా తేలాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more