తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత స్టాలిన్ తనయుడు ఉదయనిధి.. ఆ పార్టీ జాతీయ అగ్రనేతలపై విమర్శలు సంధిస్తున్నారు. ఇటీవల ఆయన ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జైషా వ్యాపారం అకస్మాత్తుగా కోట్ల రూపాయలను ఎలా ఆర్జించిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
నీతి అంటూ ముసుగు తోడుక్కుని అవినీతికి తెరలేపుతున్నారని అరోపించారు. ఈ విషయంలో సీబిఐ. ఈఢీ, ఐటీ లాంటి సంస్థలు అసలు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం మరీ దారుణమని దుయ్యబట్టారు. అదే ప్రత్యర్థి పార్టీల విషయంలో అరోపణలు మాట అటుంచితే కేవలం వారిని మానసికంగా అందోళనకు గురి చేయడానికి కూడా ఈ సంస్థల అధికారులు దాడులు చేస్తూ క్యూకడతారని అరోపించారు. ఇలా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ మరసటి రోజునే ఆయన సోదరి సెంతమరయ్ ఇంటితో పాటు ఆయన బావ శబరీశన్ సన్నిహితులకు చెందిన నాలుగు ప్రదేశాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించడం గమనార్హం.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తన సోదరి ఇంటిపై కాకుండా తన ఇంటిపై సోదాలు నిర్వహించాల్సిందిగా సవాల్ విసిరారు. ఐటీ దాడులకు భయపడేందుకు, కేంద్ర సంస్థలకు దడుచుకునేందుకు తాను సామాన్యవ్యక్తిని కాదని.. తాను కరుణానిధి మనువడిని అని గుర్తుంచుకోవాలని తెలిపారు. ఇక ఇవాళ మరోమారు ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ మరణాలకు మోదీనే కారణమని, ఆయన పెట్టే ఒత్తిడి తట్టుకోలేకే వారు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్షాలు కత్తులు దూసుకుంటున్న వేళ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
దీనిపై సుష్మా స్వరాజ్ కుమార్తె భానుశ్రీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఉదయనిధి ఆరోపణలను తోసిపుచ్చారు. మోదీకి తన తల్లి ఎంతగానో విలువనిచ్చే వారని అన్నారు. ప్రధానితోపాటు పార్టీ తమకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలు తమను బాధించాయని, ఎన్నికల ప్రచారం కోసం దయచేసి తన తల్లి పేరును వాడొద్దని కోరారు. ఇదే క్రమంలో అరుణ్ జైట్లీ కుమార్తె సోనాలీ జైట్లీ కూడా స్పందిస్తూ.. ఉదయనిధి ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారన్న విషయం తమకు తెలుసని, అయితే, తన తండ్రిని అగౌరవపరిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రధాని నరేంద్రమోదీకి, తన తండ్రికి మధ్య రాజకీయాలకు అతీతమైన స్నేహం ఉందని, దానిని అర్థం చేసుకునే శక్తిని మీరు సంపాదించుకుంటారని ఆశిస్తున్నానంటూ సోనాలీ ట్వీట్ చేశారు.
కాగా ఉదయనిధి స్టాలిన్ ప్రధానమంత్రిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపి ప్రతినిధుల బృందం తమిళనాడు ఎన్నికల కమీషనర్ ను కలసి ఆయనను ఎన్నికల బరిలో నుంచి తప్పించాలని కోరింది. అంతేకాదు డీఎంకే పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న ఉదయనిధిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే తాను దివంగత మాజీ కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ ల గురించి అవమానంగా మాట్లాడింది లేదని ఉదయనిధి అన్నారు. బీజేపిలోని ఎందరో సీనియర్లను ప్రధాని మోదీ, అమిత్ షాలు వచ్చాక వారికి గౌరవం దక్కకపోగా మూలన కూర్చోబెట్టారని మాత్రమే అన్నానని, దీంతో అప్పట్లో కొనసాగిన మంత్రులపై తీవ్ర ఒత్తడి పడిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశానన్నారు. తన ప్రచారాలకు జనం భారీగా వస్తున్నందున కన్నుకుట్టిన బీజేపి తన ప్రచారాలని నిలువరించాలని ప్రయత్నిస్తోందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 02 | వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు జరిగి రెండేళ్లు అవుతుందని, అయినా నిందితులను ఇప్పటివరకు రాష్ట్ర పోలీసులు పట్టుకోలేకపోయారని ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి హత్యకేసులో తప్పనిసరిగా రాజకీయ ప్రయోజనాలు... Read more