Ys Viveka case; Danger to witnesses lives claims Sunita వైఎస్ వివేకా కేసులో సాక్ష్యుల ప్రాణాలకు ముప్పు: వైఎస్ సునిత

Andhra cm s cousin urges cbi expedite probe into her father s vivekananda reddy s murder

High Court, YSRCP Government, YS Vivekananda Reddy, Murder, Daughter, Narreddy Sunitha, CBI, YS Jagan, AP CM, Andhra Pradesh govt, YSRCP Government, YS Jagan, Andhra Pradesh, Crime

Andhra Pradesh Chief Minister Y S Jaganmohan Reddy''s cousin Suneetha Narreddy Friday demanded the CBI expedite the probe into the alleged murder of her father and former minister Y S Vivekananda Reddy, claiming any further "delay" may put witnesses'' lives in danger.

వైఎస్ వివేకా కేసులో సాక్ష్యుల ప్రాణాలకు ముప్పు: వైఎస్ సునిత

Posted: 04/02/2021 08:24 PM IST
Andhra cm s cousin urges cbi expedite probe into her father s vivekananda reddy s murder

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు జరిగి రెండేళ్లు అవుతుందని, అయినా నిందితులను ఇప్పటివరకు రాష్ట్ర పోలీసులు పట్టుకోలేకపోయారని ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి హత్యకేసులో తప్పనిసరిగా రాజకీయ ప్రయోజనాలు వున్నాయని, రాజకీయ ప్రమేయంతోనే ఈ కేసులో తీవ్ర జాప్యం జరుగుతోందని అమె అనుమానాలను వ్యక్తం చేశారు. తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడాలని తాను పోరాడుతున్నట్లు చెప్పారు. ఈ కేసును వదిలేయాలని చాలా మంది సలహా ఇచ్చారని, తన మనసు మాత్రం న్యాయం కోసం పారాడాలని చెబుతోందని అన్నారు.

తన తండ్రి హత్యకేసులో న్యాయం కోసం పోరాడే క్రమంలో తాము అలిసిపోతున్నామని అమె ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో కీలకంగా మారిన సాక్షులు ఎందరు మరణించాక కేసు దర్యాప్తు పూర్తవుతుందని అమె ప్రశ్నించారు. మాజీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ మంత్రి చనిపోతే పరిస్థితి ఇలావుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఎంటో అర్థమవుతుందని అమె అందోళన వ్యక్తం చేశారు. ఈ అన్యాయంపై పోరాటంలో తనకు అందరి సహకారం కావాలని అమె కోరారు.

ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ. ఈ హత్య అనంతరం తమ జీవితాల్లో ప్రశాంతత అనేది లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. అందుకు ప్రజల మద్దతు తీసుకుందామనే తాను ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానని, ఈ హత్యకేసులో తమకు తెలిసిన విషయాలను ఎవరైనా వెల్లడించకపోతారా అని భావిస్తున్నామని పేర్కొన్నారు. తన తండ్రి వివేకా హత్యకేసులో 15 మంది అనుమానితుల జాబితాను దర్యాప్తు అధికారులకు అందజేసినట్టు వెల్లడించారు. ఆ అనుమానితుల్లో ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా ఉన్నాడని తెలిపారు. భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిల పేర్లు కూడా ఉన్నాయని చెప్పారు.

ఈ జాబితాలో మొదటిపేరు వాచ్ మన్ రంగన్న అని, అతని వ్యవహార శైలి ఎంతో అనుమానాస్పదంగా ఉందన్నారు. ఆ తర్వాత పేరు ఎర్ర గంగిరెడ్డి అని, ఆయన తన తండ్రికి ఎంతో సన్నిహితుడని, హత్య జరిగిన తర్వాత ఘటన స్థలంలో మరకలు శుభ్రం చేయించింది ఆయనే అని ఆరోపించారు. పరమేశ్వర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు సంబంధించి అనేక సందేహాలున్నాయని అన్నారు. ఇక తమ కుటుంబంలో తమకు కొందరు మద్దతుగా నిలుస్తున్నారని వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిశానని తెలిపారు. దర్యాప్తు సంస్థలు ఈ కేసుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సునీతారెడ్డి కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles