ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకోవడం.. అందుకు సంబంధించిన బిల్లును కూడా అసెంబ్లీలో ఇటీవల అమోదించిన చట్టంగా చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ (25) ఆత్మహత్యకు యత్నించి అసుపత్రి పాలై చికిత్సపోందుతు ఇవాళ మరణించాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ సింగ్ తండాకు చెందిన సునీల్ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు ఇక రావని కలత చెంది గత నెల (మార్చి) 26న హన్మకొండలో పురుగుల మందు తాగిన సంగతి తెలిసిందే.
తాను చచ్చిపోతున్నది చేతగాక కాదని, తన మరణంతోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనే చచ్చిపోతున్నానని పేర్కొంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే ఆ యువకుడిని వరంగల్ ఎంజీఎంకు తరలించిన పోలీసులు.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. అప్పటి నుంచి సునీల్ కు అక్కడే చికిత్స చేస్తున్నారు. అయితే, శుక్రవారం ఉదయం అతడి పరిస్థితి విషమించి కన్నుమూశాడు. పోస్ట్ మార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అతడి మరణవార్త తెలుసుకున్న విద్యార్థులు, బంధువులు భారీగా గాంధీ ఆసుపత్రికి తరలివచ్చారు. సునీల్ కుటుంబానికి సీఎం కేసీఆర్ వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. కాగా, ఐదేళ్లుగా సునీల్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నాడు. 2016లో పోలీస్ నియామకాల్లో అర్హత సాధించిన అతడు.. ఫిజికల్ టెస్టుల్లో విఫలమయ్యాడు. ప్రస్తుతం హన్మకొండలోని నయీంనగర్ లో ఓ గదిని అద్దెకు తీసుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. సునీల్ కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని, వెంటనే ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more