TRS MP’s driver, two others arrested or extortion టీఆర్ఎస్ ఎంపీ ఢిల్లీ ఇంట్లో ముడుపుల కలకలం..

Trs mp s driver two others in cbi net for taking rs one lakh bribe

CBI, Maloth Kavitha, member of Parliament, driver dugesh kumar, Personal assistant, TRS, New Delhi, Saraswati Apartments, BD Marg, New Delhi, Politics

The CBI sleuths arrested three persons at the official residence of TRS MP from Mahabubabad, Maloth Kavitha, in New Delhi while accepting a bribe of Rs 1 lakh from a person for doing some official favours. According to the CBI officials, the trio identified as Rajib Bhattacharya, Shubanghi Gupta and Durgesh Kumar were caught red-handed while taking the bribe.

టీఆర్ఎస్ ఎంపీ ఇంట్లో ముడుపుల కలకలం.. సీబీఐ అదుపులో ముగ్గురు

Posted: 04/02/2021 02:36 PM IST
Trs mp s driver two others in cbi net for taking rs one lakh bribe

మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత ఢిల్లీ నివాసంలో లంచం బాగోతాన్ని సీబిఐ బట్టబయలు చేసింది. అమె అధికార ఢిల్లీ నివాసంలో ముగ్గురు వ్యక్తులు లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం కలకలం రేపింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఓ అక్రమనిర్మాణాన్ని అవాంతరాలు అధిగమించే పైరవీ వీరు అక్రమనిర్మాణాన్ని నిర్మిస్తున్న ఇంటి ఓనర్ మన్ మీత్ సంగ్ లాంబను కలిశారు. ఆయన ఇంటిని కూల్చేందుకు అధికారులు సన్నదమవుతున్నారని, తమకు రూ.5 లక్షలు చెల్లిస్తే అలా జరగకుండా చూస్తామని నమ్మబలికారు.

ఈ క్రమంలో మన్మీత్ సింగ్ లాంబ వారితో డబ్బు విషయంలో మరోమారు చర్చించారు. ఇక మొత్తంగా ఒప్పందం కుదర్చుకున్న మొత్తానికి సంబంధించిన అడ్వాన్ గా రూ. లక్షను ఇచ్చేందుకు మన్మీత్ సింగ్ లాంబ ఎంపీ  మాలోతు కవిత ఇంటికి వెళ్లగా అక్కడే వున్న డ్రైవర్ దుర్గేష్ కుమార్, అమె వ్యక్తిగత సహాయకులుగా చెప్పుకున్న రాజీబ్ భట్టాచార్చ, శుభాంగీ గుప్తాలకు మన్మీత్ సింగ్ లాంబ డబ్బులు అందించారు. ఆ వెనువెంటనే అమె ఢిల్లీ నివాసంలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు రూ. లక్షల లంచం డబ్బును స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. రాజీవ్ భట్టాచార్య, శుభాంగి గుప్తా‌తోపాటు ఎంపీ కవిత డ్రైవర్ దుర్గేశ్‌ కుమార్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఢిల్లీలోని తన నివాసంలో సీబీఐ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విషయమై ఎంపీ కవిత స్పందించారు. తనకు వ్యక్తిగత కార్యదర్శులుగా చెప్పుకుంటున్న  రాజీవ్ భట్టాచార్య, శుభాంగి గుప్తా‌ ఎవరో కూడా తనకు తెలియదని, తాను పీఏలుగా ఎవరినీ నియమించుకోలేదని అన్నారు. తెలంగాణలో మాత్రమే తనకు ప్రభుత్వం కేటాయించిన పీఏలు ఉన్నారని పేర్కొన్నారు. అయితే దుర్గేష్ కుమార్ ను మాత్రం తాను ఢిల్లీలో కారు డ్రైవర్ గా నియమించుకున్నట్లు తెలిపారు. అలాగే, మహబూబాబాద్‌లోని కార్యాలయంలో ఓ ప్రైవేటు పీఏ ఉన్నారని తెలిపారు. ఢిల్లీలో తనకు రెండు నెలల క్రితమే అధికారిక నివాసాన్ని కేటాయించారని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles