Sachin Waze’s driver left SUV near Ambani’s home ముకేశ్ అంబానీ బాంబు స్కేర్ కేసులో ట్విస్టు..

Twist in mukesh ambani s bomb scare case sachin waze s driver parked scorpio nia

'Antilia', explosives-laden Scorpio, Bomb Scare case, gelatin sticks SUV, Waze,Saket Housing Society,national investigation agency,City Police Headquarters, Sachin Vaze, Mukesh Ambani bomb scare case, National Investigation Agency (NIA), Mumbai, Maharashtra, crime

The National Investigation Agency (NIA), which has been probing the Mukesh Ambani bomb scare case, has revealed that arrested Mumbai cop Sachin Vaze's personal driver drove the explosives-laden Scorpio and parked it outside 'Antilia' on February 25.

ముకేశ్ అంబానీ బాంబు స్కేర్ కేసులో ట్విస్టు.. కారు పెట్టింది వాజే కాదు..

Posted: 03/31/2021 03:07 PM IST
Twist in mukesh ambani s bomb scare case sachin waze s driver parked scorpio nia

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అసియా ఖండంలోనే అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ముంబై ఇల్లు యాంటీలియా ముందు పేలుడు పదార్థాలున్న కారును పెట్టిన కేసులో ఇది మరో ట్విస్ట్ తిరిగింది. ఈ కేసులో అంబానీ ఇంటి ఎదుట మందుగుండు సామాగ్రితో స్కార్కియో కారును పార్కు చేసింది.. పోలీస్ అధికారి సచిన్ వాజే అని అందరూ భావిస్తున్న తరుణంలో.. మరో క్లారిటీని ఇచ్చింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ). తాజాగా ఆ కారును అక్కడ పెట్టింది సచిన్ వాజే కాదని తేల్చింది. అయితే మరెవరు ఇందుకు పాల్పడివుంటారు.. అంటే.. వాజే కారు డ్రైవర్.. స్కార్పియోను తీసుకెళ్లి యాంటీలియా ముందు పెట్టాడని వెల్లడించింది.

పేలుడు పదార్థాలున్న స్కార్పియో కారును వాజే డ్రైవర్ నడుపుకుంటూ వెళ్లగా.. దానిని తమ శాఖకు చెందిన అధికారులు ఎవరూ పట్టుకోకుండా దాని వెనుకే తెల్లటి ఇన్నోవా కారులో వాజే అనుసరించారని పేర్కొంది. ములుంద్ ఐరోలి రోడ్ లో తన స్కార్పియోను పార్క్ చేశానని, దానిని ఎవరో దొంగిలించారని హత్యకు గురైన ఆ కారు యజమాని మన్సుఖ్ హిరెన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, సచిన్ వాజే ఆదేశాలతో డ్రైవర్ ఆ కారును తీసుకొచ్చి వాజే ఇంటి ముందు పెట్టారని ఎన్ఐఏ దర్యాప్తులో పేర్కొంది. ఆ తర్వాత ఫిబ్రవరి 19న హెడ్ క్వార్టర్స్ కు, మర్నాడు మళ్లీ వాజే నివాసముంటున్న సొసైటీకి తీసుకెళ్లాడని తెలిపింది.

ఫిబ్రవరి 24 వరకు అక్కడే ఉన్న కారును.. ఫిబ్రవరి 25న యాంటీలియా ముందు డ్రైవర్ పార్క్ చేశాడని వెల్లడించింది. కారును ఫిబ్రవరి 25న రాత్రి 10 గంటలకు పార్క్ చేసిన తర్వాత.. డ్రైవర్ ఆ కారు దిగి వాజే వచ్చిన ఇన్నోవాలో ఎక్కాడని పేర్కొంది. ఆ తర్వాత ఇన్నోవాలో నుంచి తెల్లటి కుర్తా వేసుకున్న వాజే దిగారని, నేరుగా బాంబులు పెట్టిన కారు దగ్గరకు వెళ్లి బెదిరింపు లేఖను వదిలేసి వచ్చారని తెలిపింది. ఆధారాలను లేకుండా చేసేందుకు హెడ్ క్వార్టర్స్ లోని రెండు డీవీఆర్లు, సాకేత్ సొసైటీలోని ఒక డీవీఆర్ (సీసీటీవీ ఫుటేజీ)ను వాజే నాశనం చేశారని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles