JD Lakshmi Narayana leads agitation of Collectorate Siege విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల కలెక్టరేట్ ముట్టడి

Vizag steel plant privatisation vv lakshmi narayana leads agitation of collectorate siege

JD Laxmi Narayana, vv laxmi narayana, steel plant expats, visakha collectorate, PIL, Amaravati, High court, Union Finance Minister, Niramala Sitharaman, Finance Minister, Vizag Steel Plant privatisation, Agitations, Trade Unions, Employees, VSP privatisation, Vizag Steel Plant privatisation, Privatization of PSU, Visakha steel plant, somu veerraju, ISPAT, Vishaka steel Plant, trade Union agitation, Visakhapatnam North Constituency, non-political JAC, Vishakapatnam, Andrha Pradesh, Politics

Former Joint Director of CBI, and retired IPS Officer, VV Lakshmi Narayana today leads the agitation with the steel plant Expats villagers, who had given up their land for the Industry, after filing a Public Interest Litigation (PIL) in Andhra Pradesh High Court at Amaravati yesterday,

"విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల కలెక్టరేట్ ముట్టడి’’

Posted: 03/31/2021 04:12 PM IST
Vizag steel plant privatisation vv lakshmi narayana leads agitation of collectorate siege

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత యాభై రోజులుగా దీక్షలను కొనసాగిస్తున్న స్థానికులు, కార్మికుల్లో నూతనోత్తేజం నింపారు సీబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ. నిన్న అమరావతిలోని రాష్ట్ర ఉన్నత హైకోర్టులో నిర్వాసితుల తరపున ప్రజాప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేసిన ఆయన ఇవాళ విశాఖపట్నం కలెక్టరేట్ ముట్టడికి నేతృత్వం వహించారు. ఉక్కు పరిశ్రమ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఆయన వేలాది మంది నిర్వాసితులు వెంటరాగా, పలువురు పార్టీల నేతలను కలుపుకుని విశాఖ కలెక్టరేట్‌ను ముట్టడించారు.

విశాఖ నగరంలోని సరస్వతీ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వాసితులు భారీ ప్రదర్శన నిర్వహిస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. విశాఖ కలెక్టరేట్ భవనం సమీపానికి రాగానే రెట్టించిన ఉత్సాహంతో నిర్వాసితులు కలెక్టరేట్ ఎదుటకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆందోళనకారులతో కలెక్టరేట్ నుంచి ఏ ఒక్కరూ బయటకు వెళ్లేందుకు మార్గం లేకపోయింది. దీంతో విశాఖ కలెక్టరేట్ చేరుకునే మార్గాలన్ని ట్రాఫిక్ జామ్ అయ్యాయి. అయితే అందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు.

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలతో హోరెత్తించారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను అడ్డుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఉక్కు ఉద్యోగుల ర్యాలీకి పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. . విశాఖ ఉక్కు ప్రజల గుండె చప్పుడని, ప్రైవేటీకరణ చేయడం తగదని పేర్కొన్నారు. ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశామని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరును ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో వివిధ పార్టీలు, కార్మిక సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles