Telangana CM KCR gives clarity on Lockdown తెలంగాణలో లాక్ డౌన్ పెట్టబోమని క్లారిటీ ఇచ్చేసిన కేసీఆర్

Telangana cm kcr gives clarity on lockdown in assembly

corona second wave, corona lockdown, Telangana CM KCR, lockdown, CLP Bhatti Vikramarka, Cinema Theatres, commercial complexes, Schools, Educational institutions, Telangana, Politics

Telangana CM KCR clarified on lockdown in Telangana. People should not worry on lockdown, as the government is not in a mood to keep it in the state. CM KCR responded to remarks made by CLP leader Bhatti Vikramarka in the House that theaters, business and commercial complexes should be closed in the state due to rising corona cases.

తెలంగాణలో లాక్ డౌన్ పెట్టబోమని క్లారిటీ ఇచ్చేసిన కేసీఆర్

Posted: 03/26/2021 01:28 PM IST
Telangana cm kcr gives clarity on lockdown in assembly

తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను తీవ్ర అందోళనకు గురిచేస్తున్నాయి. గత ఏడాది సరిగ్గా మార్చి నుంచి పెరిగిన కేసులతో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా సరిగ్గా మర్చిలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతూపోతున్న కారణంగా ఈ సారి మళ్లీ రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారా.? అన్న అనుమానాలు తలెత్తడంతో వ్యాపారులు, వాణిజ్య సంస్థలు తీవ్ర అందోలనకు గురవుతున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యాసంస్థలు అన్నింటికీ సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోమారు లాక్ డౌన్ విధిస్తారా అన్న అనుమానాలకు బలం చేకూరుతుంది.

ఇక సరిగ్గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై స్పష్టత ఇచ్చారు. ప్రజలు లాక్ డౌన్ విషయంలో అసలు అందోళన చెందవద్దని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ఉద్దేశ్యమేమీ లేదని తేల్చిచెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా రాష్ట్రంలో థియేటర్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేయాలంటూ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. స్కూళ్ల నుంచి కరోనా విస్తరించే అవకాశం ఉన్నందున మూసివేసినట్లు చెప్పారు. విద్యాసంస్థల మూసివేత తాత్కాలికం మాత్రమే అని చెప్పారు. తెలంగాణలో కరోనా అంత తీవ్రంగా లేదని...ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు.

గతేడాది లాక్ డౌన్‌ విధించడంతో ఆర్థికంగా చాలా నష్టపోయామని తెలిపారు. కరోనాతో మొత్తం ప్రపంచం అతలాకుతలం అయ్యిందన్నారు. పరిశ్రమల మూతవేత ఉండదని స్పష్టం చేశారు. తక్కువ మంది అతిథుల మధ్యే శుభకార్యాలు జరుపుకోవాలని సీఎం సూచించారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యాక్సిన్ డోసుల్లో మనవాటా మనకు వస్తుందని తెలిపారు. నిన్న ఒక్కరోజే 70వేల కరోనా టెస్ట్‌లు చేసినట్లు చెప్పారు. ప్రజలు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే అని స్పష్టం చేశారు. మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని ఆదేశించారు. స్వీయ క్రమశిక్షణతోనే కరోనాను నియంత్రించగలమని సీఎం కేసీఆర్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles