BJP MLC Vishwanath fires on Mysuru Commissioner పోలిస్ కమీషనర్ పై బీజేపి ఎమ్మెల్సీ ఘాటువ్యాఖ్యలు

Bjp mlc vishwanath fires on mysuru police commissioner for applauding police

bike accident, Adagur H Vishwanath, Mysuru, Traffic Cop, Karnataka, Accident, Bengaluru, Mob, Assault, Mysuru cop attacked, mob attacks cop Mysuru, cop attacked by mob Mysore, mob attacks cop Mysore, traffic police assault Mysore, traffic cop beat up Mysore, mob attack, policemen, 13 held, accident, Outer Ring Road, Hinkal flyover, video viral, social media, Mysuru, Karnataka, Crime

VHP member H Vishwanath has expressed outrage against the police commissioners who gave commendation to the police regarding the accident incident on Ring Road in Mysore four days ago. Kodhtia commends police for killing bike rider You are a commissioner of ya .. Thu .. should be ashamed of your birth. MLC H. Vishwanath is against the Commissioner of Police

'నీ జన్మకు సిగ్గుందా.?' పోలిస్ కమీషనర్ పై బీజేపి ఎమ్మెల్సీ ఘాటువ్యాఖ్యలు

Posted: 03/26/2021 01:27 PM IST
Bjp mlc vishwanath fires on mysuru police commissioner for applauding police

బీజేపి సీనియర్ నాయకుడు, విశ్వహిందూ పరిషత్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీ జన్మకు సిగ్గుందా.? యాక్ తూ.. నువ్వు ఒక పోలీసు కమీషనర్.. ఛీ అంటూ దారుణంగా విరుచుకుపడ్డారు. తమ పార్టీయే అధికారంలో వున్నా.. వారి దయతోనే మైసూరు పోలీస్ కమీషనర్ గా డాక్టర్ చంద్రగుప్తా కొనసాగుతున్నా.. వాటన్నింటినీ తోసిరాజుతూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరంలో జరిగిన ఓ ఇంజనీరు ప్రమాదానికి కారణమైన ట్రాఫిక్ పోలీసులపై చర్యలు తీసుకోకుండా వారిని ప్రశంసించడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  

మైసూరు రింగ్ రోడ్డుపై వాహనాల తనిఖీలు చేస్తున్న ట్రాపిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఒక బైక్ రైడర్ అందులోనూ ఇంజనీర్ అయిన వ్యక్తి  ప్రమాదానికి గురై మరణానిస్తే.. అందుకు కారణమైన ట్రాపిక్ పోలీసులను ప్రశంసించిన పోలీస్ కమీషనర్ చంద్రగుప్తపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీ జన్మకు సిగ్గంటూ వుందా.? అని మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రమాదానికి కారణమయ్యారని స్థానికులు పోలీసులపై తిరగబడ్డారు. వారిని చితకబాదారు. ఈ ఘటనలో ఎవరిది తప్పు.. ప్రజలు తిరగబడేంత తప్పు జరిగిందంటే.. అసలేం జరుగుతుంది.? అన్న ఘటనపై విచారణ వేయాల్సిన అధికారి.. పోలీసులను ప్రశ్నింసించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

నగర పోలీసు కమీషనర్ గా నువ్వు రోడ్డుపైకి వచ్చేది లేదు.. నగరంలో ఏం జరిగుతుందో పట్టించుకునేది లేదు. అసలు నువ్వు రోడ్డపైకి వచ్చి నగరంలో ట్రాఫిక్ ఎప్పుడు ఎలా పెరుగుతుందో.. ఎలా తగ్గుతుందో కూడా తెలుసుకోవు. సిటీలో రౌండ్స్ వేయవు. నువ్వు మైసూర్కు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యింది. నీ కింద ఎంతమంది సిసిపీలు, ఏసీపీలు పనిచేస్తున్నారు? అంతమందిని పెట్టుకుని కూడా నగరంలో ట్రాఫిక్ ను నువ్వు నియంత్రించలేక పోతున్నావా.? అసలు మైసూరు నగర ట్రాఫిక్ పోలీసులకు ట్రాఫిక్ కంట్రోల్ చేయడం రాదా.? అని మండిపడ్డారు.

ప్రజలనే కాదు.. వారి తరపున మాట్లాడే ప్రజా ప్రతినిధులన్నా గౌరవం లేదా.? అని ప్రశ్నించారు. మైసూరు పోలీస్ కమీషనర్ అయిన తరువాత నువ్వు ఎన్ని సార్లు నగరంలో పర్యటించావు..? అని ప్రశ్నించారు. ఎన్ని రోజులు నువ్వు ప్రజలను కలిశావు.? ఎన్ని సార్లు వారి అవేదనను స్వయంగా కలిసి విన్నావు.? కుర్చీలో కూర్చోని అదేశాలను ఇవ్వడమే కాదు.. నగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని విశ్వానాథం సూచించారు. నాలుగు రోజుల క్రితం మైసూర్ నగరంలో జరిగిన ఓ ఇంజనీరు ప్రమాదానికి కారణమైన ట్రాఫిక్ పోలీసులపై చర్యలు తీసుకోకుండా వారికి మైసూరు పోలీసు కమీషనర్ ప్రశంసాపత్రాలను అందించడంతో ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles