Massive Theft In SBI Bank In Peddapalli District సినీపక్కీలో ఎస్బీఐ బ్యాంకుకు కన్నం..

Burglars break into sbi in karimnagar decamp with gold cash

cctv footage, gunjapadugu, state bank of india, burglary, Ramagundam CP, v satyanarayana, Manthani, Peddapalli, Telangana, Crime

Thieves broke into the State Bank of India branch in Gunjapadugu on Wednesday night and stole two kg of gold and Rs 18 lakh cash. The burglars used a gas cutter to open the bank locker, and took away the Digital Video Recorder (DVR) to prevent police from going through the CCTV footage.

ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. సినీపక్కీలో రూ.3.10 కోట్లతో ఉడాయింపు..

Posted: 03/25/2021 07:11 PM IST
Burglars break into sbi in karimnagar decamp with gold cash

తెలంగాణలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కన్నం వేసిన దొంగలు.. సినీపక్కీలో లాకర్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసిన అందులోని నగదు, నగలతో ఉడాయించారు. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా.. మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. మొత్తం రూ.3.10కోట్ల విలువైన సొత్తును దొంగలు దోచుకెళ్లారు. బ్యాంకు గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు దొంగలకు సహకరించి వుంటారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులో ఏ మూల ఏముందో అన్న వివరాలు అన్ని తెలిసినట్టుగా దోంగలు వ్యవహరించిన తీరు ఈ అనుమానాలను బలపరుస్తోంది.

బ్యాంకు వెనుక వైపు ఉన్న కిటికీలను తొలగించి ప్రవేశించిన దొంగలు.. అంతకుముందుగానే అలారం మోగకుండా బ్యాటరీ కనెక్షన్‌ తీసేశారు. అనంతరం వెంట తెచ్చుకున్న గ్యాస్‌ కట్టర్ తో లాకర్‌ బద్దలు కొట్టి అందులోని రూ.18.46 లక్షల నగదుతో పాటు రూ.2.92 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఎంతో అనుభవం వున్న దొంగలా లేక సినిమాల ప్రభావమో తెలియదు కానీ బ్యాంకు సిసిటీవీ ఫూటేజీలో చోరీ దృశ్యాలు నిక్షిప్తం అవుతాయని తెలిసి.. సీసీ ఫుటేజీ డీవీఆర్‌ బాక్స్ ను సైతం వెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్‌ పాలరాజు ఫిర్యాదుతో మంథని పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే ఈ కేసును పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలంలో ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. అయితే దొంగలు మరీ తెలివిమీరి ఉండటం పోలీసులకు విస్మయం కలిగిస్తోంది. వేలిముద్రలు సైతం దొరకకుండా దొంగలు అన్ని జాగ్రత్తలు తీసుకొని దోపిడీకి పాల్పడ్డారని రామగుండం సీపీ సత్యనారాయణ చెప్పారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసును సవాలుగా తీసుకున్నట్లు చెప్పారు. నిందితులకోసం మొత్తం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles