AP HighCourt serves notices to two ministers on SEC petition పెద్దిరెడ్డీ, బొత్సా సత్యనారాయణలకు హైకోర్టు నోటీసులు

Sec nimmagadda petition hc serves notices to minister peddireddy botsa satynarayana

High Court notices to ministers, High Court notices to Peddireddy Ramachandra Reddy, High Court notices to Botsa Satyanarayana, SEC seeks CBI probe, SEC governor office info leakage, SEC petition in High Court, SEC, Minister Botsa Satyanarayana, State Election Commissioner, Nimmagadda Ramesh, AP High Court, AP Governor, CBI probe, Raj Bhavan, Andhra Pradesh, Politics

The Andhra Pradesh High Court served notices to ministers Peddireddy Ramachandra Reddy and Botsa Satyanarayana after hearing arguments on petition filed by State Election Commissioner Nimmagadda Ramesh Kumar seeking a CBI investigation into the alleged leak of privileged letters between him and the Governor.

పెద్దిరెడ్డీ, బొత్సా సత్యనారాయణలకు హైకోర్టు నోటీసులు

Posted: 03/23/2021 03:13 PM IST
Sec nimmagadda petition hc serves notices to minister peddireddy botsa satynarayana

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులకు తాఖీదులు పంపింది. తామిచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వాలని అదేశించింది. రాష్ట్ర గ‌వ‌ర్నర్, త‌న‌కు మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ సమాచారం లీక్ కావడంపై విస్మయం వ్యక్తం చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించరు. దీనిపై సీబిఐ చేత విచారణ జరిపించాలని ఆయన డొమాండ్ చేశారు. తాను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో ముఖాముఖీగా జరిగిన సంబాషణ ఏకంగా గవర్నర్ కార్యాలయం నుంచే లీక్ కావడంపై ఆయన రాష్ట్ర హైకోర్టులో పిటిష‌న్ వేశారు.

గవ‌ర్న‌ర్ తో పంచుకున్న అత్యంత కీల‌క స‌మాచారం లీక్ అయింద‌ని తన పిటీషన్ లో పేర్కోన్నారు. ఆ స‌మాచారం గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌కు రావ‌డంపై సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశించాల‌ని పిటిష‌న్ లో కోరారు. ఈ సిటీషన్ ను ఇవాళ విచారించిన న్యాయస్థానం రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. గవర్నర్ తో చర్చలు జరుపుతున్న సమయంలో వున్న ఇద్దరు మంత్రులకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై తక్షణం సమాధానం ఇవ్వాలని అదేశించింది. ఈ కేసును వచ్చే మంగళవారు మార్చి 30కి వాయిదా వేసింది.

కాగా, న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసిన నిమ్మగడ్డ ప్ర‌తివాదులుగా రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఆధిత్యనాథ్ దాస్, గ‌వ‌ర్న‌ర్ ముఖ్యకార్య‌ద‌ర్శితో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ పేర్లను చేర్చారు. కాగా ఇవాళ కేవలం మంత్రులకు మాత్రమే నోటీసులను న్యాయస్థానం జారీ చేసింది. ఇదిలావుండగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు ఇద్దరు మంత్రులు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. ఆయన గవర్నర్ హరిచందన్ భిశ్వభూషణ్ కు రాసిన లేఖలో తమను అవమానించేలా, విమర్శించారని వారు నోటీసులు అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SEC  Nimmagadda Ramesh  AP High Court  Botsa satyanarayana  Peddireddy  Notices  Andhra Pradesh  Politics  

Other Articles