No accident claim for death by drinking: SC అతిగా మద్యం తాగి మరణిస్తే బీమా వర్తించదు: సుప్రీం

Sc rules out insurance claim for death due to excessive alcohol consumption

Supreme Court, insurance, Consumer Court, alcohol consumption, chopal panchayat, HPSFC, Watchman, simla, Himachal Pradesh, crime

The top court passed the verdict on an appeal filed by Narbada Devi, the legal heir of the man employed as watchman (Chowkidar) with Himachal Pradesh State Forest Corporation (HPSFC), after he died on the thunderous and rainy cold night of October 7-8, 1997, in Chopal Panchayat of Shimla district.

అతిగా మద్యం తాగి మరణిస్తే బీమా వర్తించదు: సుప్రీం

Posted: 03/23/2021 02:14 PM IST
Sc rules out insurance claim for death due to excessive alcohol consumption

అతిగా మద్యం సేవించిన వ్యక్తి అదే కారణంతో చనిపోతే అతని కుటంబానికి బీమా చెల్లించాల్సిన అవసరం లేదని, ఇలాంటి ఘటనల్లో మృతుడి వారసులకు పరిహారం కూడా చెల్లిందాల్సిన అవసరం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ప్రమాదంలో మరణిస్తే తప్ప బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టమైన తీర్పును వెలువరిచింది. ఈ కేసు విచారణ సందర్భంగా జాతీయ వినియోగదారుల కోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాంలోని సిమ్లా జిల్లాలోని చోపాల్ పంచాయతీలో హిమాచల్ అటవీ సంస్థలో చౌకీదారుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి 1997లో మరణించాడు. ఆయన రాత్రి పూట ఉద్యోదానికి వెళ్లి మరుసటి రోజున మృతిచెంది కనిపించాడు. అనుమానాస్పద మరణంగా నమోదు చేసుకన్న పోలీసులు ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా మృతుడు అతిగా కురిసిన వర్షాలతో పాటు తీవ్ర చలికి మరణిచాడని.. తమకు నష్టపరిహారం చెల్లించాలని అతడి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.

అయితే, అతడు అతిగా మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని పోస్టుమార్టంలో తేలింది. అతని గొంతు నుంచి జీర్ణకోశం వరకు అతిగా మద్యం సేవించిన కారణంగా కుచించుకు పోవడంతోనే అతని మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో పోందుపర్చివుంది. దీంతో సంస్థ చేసిన బీమా అతడికి వర్తించదని.. కేవలం ప్రమాదంలో చనిపోయిన వారికి మాత్రమే అది వర్తిస్తుందని.. వారికే తాము పరిహారం కూడా చెల్లిస్తామని అది జనతా భీమా అని బీమా సంస్థ తేల్చిచెప్పింది. దీంతో మృతుడి వారసులు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. వినియోగదారుల ఫారంలో ఇరువర్గాల వారి వాదనలు విన్న తరువాత న్యాయస్థానం బాధితులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది.

దీంతో బీమా కంపెనీ జాతీయ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. విచారించిన ఫోరం బీమా కంపెనీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే, అటవీ సంస్థ మాత్రం పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ తీర్పును అటవీ సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. విచారించిన జస్టిస్ ఎంఎం శాంతన్ గౌండర్, జస్టిస్ వినిత్ శరణ్‌లతో కూడిన ధర్మాసనం జాతీయ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థించింది. అతిగా మద్యం తాగి చనిపోయిన వ్యక్తి వారసులకు బీమా చెల్లించాల్సిన అవసరం లేదని, ఇక ప్రమాదం కాదు కాబట్టి పరిహారం కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles