BTech 4th year Student found dead near Hostel హాస్టల్‌ బిల్డింగ్ పైనుంచి దూకి బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Btech 4th year student chandrika found dead near hostel suicide suspected

Chandrika suicide, Chandrika suicide cctv footage, mallareddy engineering collage student suicide, chandrika, BTech 4 yr student, Mallareddy collage of Engineering, Maisamma guda, backlogs, Hostel, CCTV footage, Medchal, Telangana, Crime

A B Tech fourth year student from Maisamma guda Malla Reddy Engineering collage, Chandrika found dead in suspisious manner behind her Hostel. A cctv footage shows she had jumped from the terrace of the Hostel in the early hours today. Police suspect suicide.

ITEMVIDEOS: హాస్టల్‌ బిల్డింగ్ పైనుంచి దూకి బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Posted: 03/23/2021 12:54 PM IST
Btech 4th year student chandrika found dead near hostel suicide suspected

మేడ్చల్‌ జిల్లాలో బిటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. పేట్‌ బషీరాబాద్ లో ప్రాంతంలోని ఓ హాస్టల్ లో ఇటీవలే చేరిన చంద్రిక అనే ఇంజనీరింగ్‌ విద్యార్ధిని అనుమానాస్పదంగా మృతి చెందింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న చంద్రికది ఆత్మహత్యా.? లేక హత్యా అన్న విషయంలోనూ కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాగా స్థానికంగా లభించిన ఓ సీసీటీవీ ఫూటేజీలో మాత్రం చంద్రిక తెల్లవారు జామున ఒంటరిగా తన హాస్టట్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకుతున్న దృశ్యాలు నిక్షిప్తమై వున్నాయి.

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చంద్రిక.. కరోనా కారణంగా కాళాశాలు అన్ని మూతపడటంతో గత ఏడుఎనమిది నెలలుగా తల్లిదండ్రులతో కలసి ఇంట్లోనే వుంది. కాగా పరీక్షల నేపథ్యంలో గత నెల ఫిబ్రవరి 4న మైసమ్మగూడలోని కృప వసతి గృహంలో చేరింది. అక్కడే నివాసం వుంటూ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో అమె హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే అమె శరీరంపై ఎలాంటి రక్తపు గాయాలు కూడా లేవని, హాస్టల్ పై నుంచి దూకినా అమె మృతదేహం మాత్రం మరికోంత దూరంలో లభ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా యువతి చంద్రిక ఘటనకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటనపై డీసీపీ పద్మజ మాట్లాడుతూ..'కృప హాస్టల్‌ పక్కన యువతి మృతదేహాం ఉందని మంగళవారం ఉదయం 8.15 కి స్థానిక కౌన్సిలర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. యువతిని మిర్యాలగూడకు చెందని చం‍ద్రికగా గుర్తించాం. ఆమెకు బాక్‌ల్యాగ్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా తర్వాత ఇటీవల సీటీకి వచ్చిన చంద్రిక ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతుంది. చదువులో వెనకబడి ఉన్నానన్న మసస్తాపంతో యువతి బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. అనుమానస్పద మృతి కేసు నమోదు చేసుకున్నాం. సీసీ కెమెరాలు, చంద్రిక ఫోన్ డేటా పరిశీలిస్తున్నాం'అని ఆమె పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles