India sees sharpest weekly Covid-19 surge దేశంలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు..

India sees biggest single day surge in covid cases since early november

India Coronavirus Cases, Coronavirus, coronavirus news, india covid 19 news, covid 19 vaccine, coronavirus india, coronavirus Telangana, coronavirus Andhra Pradesh, coronavirus maharashtra, coronavirus india news, corona cases in india, india news, coronavirus news, covid 19 latest news, maharashtra covid 19 cases

As India stares at the second Covid wave, 46,951 fresh coronavirus cases in the last 24 hours - biggest single-day jump since November 7 - took the country's tally to 1,16,46,081 total infections, the government data this morning showed. Of these, over 1.11 crore people have recovered so far, and 1,59,97 total deaths have been recorded.

దేశంలో గత నవంబర్ నాటి స్థాయిలో పెరిగిన కరోనా కేసులు..

Posted: 03/22/2021 12:04 PM IST
India sees biggest single day surge in covid cases since early november

దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ నెల తొలినాళ్లలో నమోదైన స్థాయిలో కొత్త‌ క‌రోనా కేసులు నమోదు కావడం దేశప్రజల్లో అందోళన కలిగిస్తోంది. గ‌డచిన 24 గంట‌ల్లో 46,951 మందికి కరోనా నిర్ధారణ అయింది. కాగా వాటిలో అత్యధికంగా మహారాష్ట్రలోనే దాదాపు 30 వేల కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ ఉదయం విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన గణంకాల ప్రకారం... దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,16,46,081కు చేరింది. కాగా, కొత్త‌గా 21,180 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 212 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,967కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,51,468 మంది కోలుకున్నారు. 3,34,646 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్ లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 4,50,65,998 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇక మహారాష్ట్ర తరువాత పంజాబ్(2,644), కేరళ (1,875), కర్ణాటక (1,715), గుజరాత్ (1,580) రాష్ట్రాలలోనూ అత్యధిక స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 37,079 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, 337 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,03,455కి చేరింది.

ఈ మేరకు తెలంగాణ వైద్యఅరోగ్యశాఖ ఇవాళ ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనాబారిన పడిన ఇద్దరు అసువులు బాసారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 91 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1671కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 181 మంది రోగులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య రెండు లక్షల 98 వేల 826కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2958 కేసులు యాక్టివ్ గా వుండగా, వాటిలో 1226 కేసులు హోం ఐసోలేషన్ లో చికిత్సను పోందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles