Four militants killed in encounter in Kashmir’s Shopian జమ్మూకాశ్మీర్ ఎన్ కౌంటర్లో నలుగురు ఉగ్రవాదుల హతం..

Four let terrorists killed in encounter in munihal area of shopian in j k

Shopian encounter, two terrorists killed in Shopian, terrorists killed in encounter, Jammu and Kashmir, Shopian, encounter, police, army, CRPF

Four terrorists belonging to proscribed terror outfit Lashkar-e-Taiba (LeT) were killed in an encounter with the security forces in the Munihal area of Shopian, Jammu and Kashmir in the early hours on Monday, the Kashmir Zone Police said.

జమ్మూకాశ్మీర్ ఎన్ కౌంటర్లో నలుగురు ఉగ్రవాదుల హతం..

Posted: 03/22/2021 11:12 AM IST
Four let terrorists killed in encounter in munihal area of shopian in j k

జమ్మాకాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని మనిహాల్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎన్ కౌంటర్లో నలుగురు లష్కరే తాయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం వేకువ జాము నుంచే ప్రారంభమైన కాల్పులతో మనిహాల్ గ్రామంలో ఒక్కసారిగా భయానక వాతావరణం అలుముకుంది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పుల శబ్దాలతో గాఢనిద్రలో పురజనులను నిద్రలేచి ఏం జరుగుతుందో తెలుసుకునే ధైర్యం కూడా చేయలేకపోయారు.

మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఇవాళ వేకువజామునే ఆ ప్రాంతానికి చేరకుని అక్కడి బస్తీల్లో తనిఖీలు చేశారు. ఆ ప్రాంతానంతా దిగ్భంధించి వలయంలా ఏర్పాడి గ్రామంలో అణువణువూ తనిఖీ చేశారు. ఇది గమనించిన ఉగ్రవాదలు ఒక ఇంట్లోంచి భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దీంతో వెనువెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించారు. కాల్పుల జరిగిన ఘటనా స్థలంలో తొలుత ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

అయితే కొద్దిపేవు ఉగ్రవాదుల నుంచి ఎలాంటి కాల్పులు లేకపోవడంతో వేచి చూసిన తరువాత మళ్లీ కాల్పులు ప్రారంభమయ్యాయి. అప్రమత్తంగా వున్న భారత భద్రతా దళాలు మరోమారు ఎదురుకాల్పులతో నక్కిన ఉగ్రవాదలును అంతమొందించారు. కాల్పుల తర్వాత వెళ్లి మొత్తంగా నలుగురు ఉగ్రవాదులు హతమై కనిపించారు. వీరంతా లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47, మూడు పిస్టల్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles